Rashmika – Anand : మరోసారి విజయ్ దేవరకొండ తమ్ముడి కోసం రాబోతున్న రష్మిక మందన్న..

గతంలో బేబీ సినిమా సాంగ్ లాంచ్ కి ఆనంద్ దేవరకొండ కోసం రష్మిక వచ్చింది.

Rashmika Mandanna – Anand Deverakonda : విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఇప్పుడు ‘గం గం గణేశా'(Gam Gam Ganesha) సినిమాతో వస్తున్నాడు. ఉదయ్‌ శెట్టి ద‌ర్శ‌క‌త్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా, ప్రగతి శ్రీవాత్సవ, నయన్ సారిక హీరోయిన్స్ గా గం గం గణేశా సినిమా తెరకెక్కింది. హై-లైఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి లు ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాలో జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, బిగ్‌బాస్ ప్రిన్స్ యావర్ ముఖ్య పాత్రలు చేశారు.

ఇప్పటికే గం గం గణేశా సినిమా నుంచి రిలీజయిన టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. గం గం గణేశా ట్రైలర్ చూసాక ఆనంద్ మరో హిట్ కొట్టబోతున్నట్టు తెలుస్తుంది. గం గం గణేశా సినిమా మే 31న రిలీజ్ కానుంది. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా నేడు నేడు మే 27న సాయంత్రం 6 గంటల నుండి హైదరాబాద్ దసపల్లా హోటల్ లో గం గం గణేశా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.

Also Read : Devara : ‘దేవర’లో నటిస్తున్న జబర్దస్త్ కమెడియన్.. దేవర గురించి ఏం చెప్పాడంటే..

అయితే గం గం గణేశా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రష్మిక మందన్న గెస్ట్ గా వస్తుంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ – రష్మిక మధ్య ఏదో నడుస్తుందని ఎప్పుడూ సోషల్ మీడియాలో, మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ గతంలో బేబీ సినిమా సాంగ్ లాంచ్ కి ఆనంద్ దేవరకొండ కోసం రష్మిక వచ్చింది. ఇప్పుడు మళ్ళీ గం గం గణేశా సినిమా కోసం ఏకంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రష్మిక వస్తుండటంతో ఈ వార్త వైరల్ అవుతుంది. విజయ్ తమ్ముడి కోసం రష్మిక కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తుందిగా అంటూ మరో సారి విజయ్ – రష్మిక గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఏముందో తెలీదు కానీ రష్మిక ఇలా ఆనంద్ కోసం వస్తుండటంతో విజయ్ అభిమానులు సంతోషిస్తున్నారు. మరి ఈ ఈవెంట్లో రష్మిక ఏం మాట్లాడుతుందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు