IPL 2024 : అయ్యయ్యో.. ఎస్ఆర్‌హెచ్‌ ఓటమితో ఏడ్చేసిన కావ్యా పాప.. వీడియో వైరల్

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు విజయంతో మైదానంలో ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్నంటాయి. షారూక్ ఖాన్, పలువురు బాలీవుడ్ తారలు మ్యాచ్ ను వీక్షించేందుకు స్టేడియం వచ్చారు.

Kavya Maran : ఐపీఎల్ 2024 సీజన్ ట్రోపీని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కైవసం చేసుకుంది. ఆదివారం రాత్రి చెన్నై స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు పరుగులు రాబట్టడంలో విఫలమైంది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో కేవలం 113 పరుగులకే ఆలౌట్ అయింది. 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు కేవలం 10.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి 2024 ఐపీఎల్ విజేతగా నిలిచారు.

Also Read : IPL 2024 Final : ఐపీఎల్ టైటిల్ కోల్‌కతాదే.. 8 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై ఘన విజయం

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు విజయంతో మైదానంలో ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్నంటాయి. జట్టు యాజమాని షారూక్ ఖాన్, పలువురు బాలీవుడ్ తారలు మ్యాచ్ ను వీక్షించేందుకు స్టేడియం వచ్చారు. కేకేఆర్ జట్టు విజయం అనంతరం వారు ప్రేక్షకులకు అభివాదం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. మరోవైపు హైదరాబాద్ జట్టు ఓటమితో ఆ జట్టు యాజమాని కావ్య మారన్ కన్నీరు పెట్టుకున్నారు. ఆమెపక్కని వారు కావ్య మారన్ ను ఓదార్చేప్రయత్నం చేసినా ఆమె వెక్కివెక్కి ఏడ్చారు. ఇందుకు సంబంధించిన వీడియ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read : IPL 2024 Prize Money : ఐపీఎల్ విజేత‌కు ప్రైజ్‌మ‌నీ ఎంతంటే..?

కావ్య మారన్ ఎస్ఆర్ హెచ్ ఆడిన ప్రతి మ్యాచ్ నూ స్టేడియంకు వచ్చి వీక్షించారు. జట్టు క్రీడాకారులను, అభిమానులు ఉత్సాహపరుస్తూ కనిపించారు. ఎస్ఆర్ హెచ్ మ్యాచ్ అంటే స్టేడియంలో కెమెరాలు, అభిమానుల కళ్లన్నీ కావ్య మారన్ వైపే ఉండేవి. హైదరాబాద్ జట్టు మంచి ఊపుమీద ఉండటంతో ఫైనల్ మ్యాచ్ లోనూ విజయం ఖాయమని ఫ్యాన్స్ భావించారు. కానీ, ఊహించని రీతిలో హైదరాబాద్ జట్టు ఓటమితో తట్టుకోలేకపోయిన కావ్య మారన్ కన్నీటి పెట్టుకున్నారు. ఈ దృశ్యాలు చూసిన ఎస్ఆర్ హెచ్ ఫ్యాన్స్.. అయ్యయ్యో.. పాపం కావ్య మారన్ అంటూ సోషల్ మీడియా వేదికగా సానుభూతి తెలియజేస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు