Puneeth Rajkumar: జూనియర్ ఎన్టీఆర్‌తోనే కాదు.. సీనియర్ ఎన్టీఆర్‌తోనూ పునీత్‌కు అనుబంధం.. ఎలాగో తెలుసా..?

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు.. జూనియర్ ఎన్టీఆర్ తో మంచి అనుబంధం ఉండేది. సీనియర్ ఎన్టీఆర్ కూడా తనపై ప్రేమను కనబరిచేవారని.. గతంలో పునీత్ ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు.

Puneeth Rajkumar: జూనియర్ ఎన్టీఆర్‌తోనే కాదు.. సీనియర్ ఎన్టీఆర్‌తోనూ పునీత్‌కు అనుబంధం.. ఎలాగో తెలుసా..?

Ntr Puneet

Puneeth Rajkumar: శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తో.. మన టాలీవుడ్ జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న ఫ్రెండ్లీ రిలేషన్ గురించి చాలా మందికి తెలుసు. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. ఈ విషయాన్ని చాలాసార్లు ఎన్టీఆర్, పునీత్.. ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు. అంతెందుకు.. పునీత్ కోసం ఓ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్.. ఒక పాట కూడా పాడారు. అంతటి ఫ్రెండ్స్ ఈ ఇద్దరూ. ఇదిలా ఉంటే.. సీనియర్ ఎన్టీఆర్ తోనూ.. పునీత్ కు మంచి రిలేషన్ ఉండేదన్న విషయం మీకు తెలుసా? యస్. సీనియర్ ఎన్టీఆర్ కూడా.. పునీత్ అంటే మంచి ప్రేమ కనబరిచేవారట. ఈ విషయాన్ని పునీత్ ఓ సందర్భంలో స్వయంగా మీడియాతో షేర్ చేసుకున్నారు.

తనకు ఐదేళ్ల వయసున్నప్పుడు.. తండ్రి రాజ్ కుమార్ తో కలిసి ఓ సారి పునీత్ ఏవీఎం స్టూడియోకు వెళ్లాడు. సీనియర్ రాజ్ కుమార్ కు మంచి ఫ్రెండ్ అయిన సీనియర్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ చూడ్డానికి ఇద్దరూ కలిసి వెళ్లారు. ఆ మూవీలో సీనియర్ ఎన్టీఆర్ రేస్ కార్ డ్రైవర్ గా నటించారు. ఆ కార్ చూసి ముచ్చటపడ్డ ఆనాటి ఐదేళ్ల పునీత్.. తన తండ్రితో ఆ విషయాన్ని చెప్పాడు. అలాంటి కార్ కావాలని అడిగాడు. ఇదంతా గమనించిన సీనియర్ ఎన్టీఆర్.. ఆ సమయంలో సైలెంట్ గా ఉన్నా.. తర్వాత సర్ ప్రైజ్ ఇచ్చారట.

పునీత్ కోరిన రేస్ కార్ ను.. వాళ్ల ఇంటికి పంపించారట. షాకింగ్ గా.. సర్ ప్రైజ్ గా ఫీలయిన పునీత్.. ఎంతో సంతోషించారట. కానీ.. అది తమతో ఉంచుకోకుండా.. తిరిగి వెనక్కి పంపించారట. స్వయంగా.. ఈ విషయాన్ని పునీత్ రాజ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ జీవితకథను రెండు భాగాలుగా.. ఆయన తనయుడు బాలకృష్ణ చిత్రీకరించారు. అందులో ఓ భాగం అయిన కథానాయకుడు చిత్రాన్ని కన్నడలో విడుదల చేయడానికి ముందుగా.. ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. దానికి హాజరైన పునీత్.. ఈ విషయాన్ని ఆనాడు మీడియాతో పంచుకున్నారు.

తనకు జూనియర్ ఎన్టీఆర్ తోనే కాదు.. సీనియర్ ఎన్టీఆర్ తోనూ మంచి అనుబంధం ఉందని పునీత్ ఆనందించారు. ఇలా.. అందరివాడుగా పేరున్న కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్.. అకస్మాత్తుగా అందరికీ దూరం కావడం.. కన్నడ చిత్ర పరిశ్రమనే కాదు.. సినిమా రంగానికి చెందిన ప్రతి ఒక్కరినీ తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. అభిమానులకైతే.. తీరని గుండెకోతను మిగిల్చింది. ఇవాళ ఉదయం జిమ్ చేస్తుండగా గుండెపోటుకు గురైన పునీత్ ను.. ఆయన సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ.. పరిస్థితి అప్పటికే చేయి దాటిపోయింది.

డాక్టర్లు సాధ్యమైనంతగా ప్రయత్నించారు. అందుబాటులో ఉన్న అన్ని విధాలుగా చికిత్స అందించారు. చివరికి పునీత్ రాజ్ కుమార్ అందరినీ విడిచి వెళ్లిపోయారు. సినిమా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు.. పునీత్ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రేపు కర్ణాటక ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన పార్థివ దేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి.