RRR: నాటు పాటకి పునీత్ స్టెప్పులేస్తే.. వీడియో వైరల్!

పునీత్ నాటు పాటకి డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది అంటూ ఓ నెటిజన్ పునీత్ పాత డాన్స్ వీడియోలను ఎడిట్ చేసి నాటు పాటతో కలిపి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

RRR: నాటు పాటకి పునీత్ స్టెప్పులేస్తే.. వీడియో వైరల్!

Rrr

RRR: ఇండియన్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ మాట ఎందుకు అంటున్నారో ఒక్క పాటతో చెప్పేసింది ఆర్ఆర్ఆర్ టీమ్. ఇప్పుడు ఎక్కడ విన్నా నాటు నాటు నాటు.. ఇదే ఇప్పుడు తెలుగు సినీ ప్రేక్షకులను ఊపేస్తున్న పదం.. పాట. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలసి వేసిన స్టెప్పులు ఒక ఊపు ఊపేస్తుంటే సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకు.. వృద్దులు సైతం ఈ పాటకి స్టెప్పులేస్తున్నారు. ఈ వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Poonam Kaur: పంజాబీ అందం పూనమ్ గ్లామర్ ట్రీట్!

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో ఈ మధ్యనే మరణించిన సంగతి తెలిసిందే. ఆ బాధ నుండి అభిమానులు ఇంకా కోలుకోనేలేదు. కాగా, పునీత్ మంచి డాన్సర్. మరి పునీత్ నాటు పాటకి డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది అంటూ ఓ నెటిజన్ పునీత్ పాత డాన్స్ వీడియోలను ఎడిట్ చేసి నాటు పాటతో కలిపి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పునీత్ డ్యాన్సులతో నాటు నాటు కన్నడ వెర్షన్ మాషప్ కి నెటిజన్స్ తెగ ఫిదా అవుతున్నారు.

Shilpa Shetty: పెళ్లి ప్రమాణాలను గుర్తు చేసుకున్న శిల్పా.. ఫోటోలు వైరల్!

ఆర్ఆర్ఆర్ టీం కూడా పునీత్ మాషప్ వీడియోకి స్పందించ‌డం విశేషం. ఇక, ఆర్ఆర్ఆర్ విషయానికి వస్తే.. ఆర్ఆర్ఆర్ ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందా అని ప్రేక్షకులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. ఈ విజువల్ వండర్.. జనవరి 7న రిలీజ్ కు రెడీ అవుతుండడంతో చిత్ర యూనిట్ భారీ ప్రచార కార్యక్రమాలు షురూ చేసింది. త్వరలోనే మరో పాట విడుదల చేయనుండగా డిసెంబర్ తొలి వారంలో ట్రైలర్ విడుదల చేయనున్నారు.