Pushpa : ‘పుష్ప’ సాంగ్ కోసం తన రెండు గాజులు అమ్ముకున్న హీరోయిన్

తాజాగా ఓ కొత్త హీరోయిన్ 'పుష్ప' సినిమాలోని 'సామి.. నా సామి' సాంగ్ కి కవర్ సాంగ్ చేసింది. అయితే ఈ కవర్ సాంగ్ చేయడానికి తన రెండు బంగారు గాజులు అమ్ముకొని ప్రొడ్యూస్ కూడా చేసుకుంది.

Pushpa : ‘పుష్ప’ సాంగ్ కోసం తన రెండు గాజులు అమ్ముకున్న హీరోయిన్

Rekha Boj

Pushpa :  అల్లుఅర్జున్ హీరోగా రష్మిక హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న మాస్ యాక్షన్ సినిమా ‘పుష్ప’. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలోని సాంగ్స్ రిలీజ్ అయి మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ సినిమాలోని అన్ని సాంగ్స్ బాగుండటంతో బాగా వైరల్ అయ్యాయి. యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సాంగ్స్ కి చాలా మంది కవర్ సాంగ్స్ కూడా చేశారు.

Shalu Chaurasia : నటి చౌరాసియా కేసులో నిందితుడు పట్టివేత

తాజాగా ఓ కొత్త హీరోయిన్ ‘పుష్ప’ సినిమాలోని ‘సామి.. నా సామి’ సాంగ్ కి కవర్ సాంగ్ చేసింది. అయితే ఈ కవర్ సాంగ్ చేయడానికి తన రెండు బంగారు గాజులు అమ్ముకొని ప్రొడ్యూస్ కూడా చేసుకుంది. యువ హీరోయిన్ రేఖా భోజ్ దామిని విల్లా, రంగేలా, క‌ళ్యాణ త‌స్మై న‌మ‌హః వంటి చిన్న చిత్రాల్లో నటించింది. కొంతమంది యువ హీరోయిన్స్ పాపులారిటీ కోసం ఏదో ఒకటి చేస్తుంటారు. తాజాగా ఈ హీరోయిన్ ట్రేండింగ్ లో ఉన్న ‘పుష్ప’ సాంగ్ కి కవర్ సాంగ్ చేసి తన యూట్యూబ్ ఛానల్ లో పెట్టింది.

Bigg Boss 5 : కొత్త కెప్టెన్‌గా మానస్.. కాజల్‌తో గొడవలకు ఫుల్‌స్టాప్..

ఒరిజిన‌ల్ సాంగ్‌కు ఏ మాత్రం తగ్గకుండా రష్మికకి పోటీగా స్టెప్పులు వేసింది. వీడియో కూడా చాలా బాగా రావడంతో ఈ కవర్ సాంగ్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. రేఖభోజ్ తన అందాలతో సాంగ్ లో రష్మికని మించి రెచ్చిపోయింది. అయితే ఈ సాంగ్ తనని ప్రూవ్ చేసుకోడానికి చేసానని తెలిపింది రేఖ. ఈ సాంగ్ కోసం ఎంతో కష్టపడ్డానని, ఈ సాంగ్ నేనే ప్రొడ్యూస్ చేశానని, ఇందుకోసం ఏకంగా త‌న రెండు బంగారు గాజులు కూడా అమ్ముకుందని తెలిపింది. ఈ సాంగ్ తో అయినా బాగా పాపులర్ అయి ఈ హీరోయిన్ కి పెద్ద సినిమా ఆఫర్స్ వస్తాయేమో చూడాలి.