Pushpa: రిలీజ్ డేట్ ఇచ్చినా.. బన్నీ నుండి ప్రచారం లేదేంటి?

టాలీవుడ్ లో కొత్త సినిమాల సందడి మొదలైంది. కరోనా తర్వాత సరైన సమయం కోసం వేచిచూస్తున్న సినిమాలతో పాటు కొత్త కొత్త క్రేజీ సినిమాలు కూడా విడుదల తేదీలను ఖరారు చేసుకున్నాయి. ఒకటీ రెండు..

Pushpa: రిలీజ్ డేట్ ఇచ్చినా.. బన్నీ నుండి ప్రచారం లేదేంటి?

Pushpa

Pushpa: టాలీవుడ్ లో కొత్త సినిమాల సందడి మొదలైంది. కరోనా తర్వాత సరైన సమయం కోసం వేచిచూస్తున్న సినిమాలతో పాటు కొత్త కొత్త క్రేజీ సినిమాలు కూడా విడుదల తేదీలను ఖరారు చేసుకున్నాయి. ఒకటీ రెండు పెద్ద సినిమాలు మినహా పెద్ద సినిమాలన్నీ డేట్స్ ఇచ్చేశాయి. ఈ ఏడాది వస్తాడా రాడా అనుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప రాజ్ కూడా నో డౌట్ అనుకున్న టైంకి వచ్చేస్తానని ఖరాకండీగా చెప్పేశాడు. పుష్ప మేకర్స్ నుండి ఫస్ట్ పార్ట్ విడుదల తేదీ ఇదేనని డిసెంబర్ 17 లాక్ చేశారు.

Deepika Padukone: దీపికాకు అరుదైన ఘనత.. ది గ్లోబల్ అచీవర్స్ అవార్డు!

తమ అభిమాన హీరో సినిమా విడుదల తేదీ వచ్చేయడంతో అభిమానులు సోషల్ మీడియాలో సందడి కూడా మొదలు పెట్టారు. అయితే, ఇదే సోషల్ మీడియాలో ఈ సినిమా మీద డౌట్స్ కూడా వినిపిస్తున్నాయి. సహజంగా తమ సినిమా గురించి స్టార్ హీరోలందరూ సోషల్ మీడియాలో అప్డేట్స్ ఇస్తూ హైప్ పెంచేస్తుంటారు. అయితే రిలీజ్ డేట్ ఇచ్చినా తన సినిమా డేట్ పై బన్నీ నుండి మాత్రం ఎలాంటి పోస్ట్ రాలేదు. సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించినా బన్నీ సోషల్ మీడియాలోని ఏ ఫ్లాట్ ఫామ్ నుండి కూడా ఎలాంటి పోస్ట్ చేయనేలేదు.

Alia Bhatt: టార్గెట్ 2022.. సీనియర్ హీరోయిన్స్‌ను మించిపోతున్న అలియా

దీంతో కొందరు అభిమానులు కొద్దిగా డౌటానుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై ఏమన్నా క్లారిటీ వస్తుందేమో చూడాలి. అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటుడు ఫహద్ ఫాజిల్ సాలిడ్ విలన్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాని విజనరీ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. సుకుమార్ బన్నీ కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా కావడం.. ఇప్పటికే విడుదలైన లుక్స్, టీజర్స్, సాంగ్స్ సినిమా మీద హైప్ పెంచేయడంతో పాన్ ఇండియన్ లెవెల్లో మంచి బజ్ నెలకొంది.