Pushpa : సంక్రాంతికి ఓటిటిలో ‘పుష్ప’ ??

'పుష్ప' సినిమా డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ భారీ ధరకి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అమెజాన్ లో ఈ సినిమాను నెల రోజుల తర్వాతే స్ట్రీమింగ్ చేసేలా............

Pushpa : సంక్రాంతికి ఓటిటిలో ‘పుష్ప’ ??

Vinod

Pushpa :  అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా ‘పుష్ప’. సుక్కు-బన్నీ కాంబినేషన్ లో మూడో సినిమాగా ‘పుష్ప’ నిన్న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేశారు. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా బన్నీ వన్ మ్యాన్ షోగా నిలిచింది. కొన్ని చోట్ల మిక్స్‌డ్ టాక్ వినిపించినా ఫ్యాన్స్ మాత్రం సినిమా అదిరిపోయింది అని అంటున్నారు. సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ తో ఇరగదీశాడని, బన్నీ యాక్టింగ్ సినిమాకి చాలా ప్లస్ అయిందని అంటున్నారు. కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి అని సమాచారం.

‘పుష్ప’ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. దాదాపు 100 కోట్లకు పైగా ‘పుష్ప’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ఇటీవల వచ్చే సినిమాలు ముందే ఓటిటి బిజినెస్ కూడా చేసేసుకుంటున్నాయి. సినిమా రిలీజ్ అయిన రెండు, మూడు వారాలకే ఓటిటిలో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక స్టార్ హీరోల సినిమాలైతే మరో వారం ఆగుతున్నారు. ‘పుష్ప’ సినిమా ఓటిటి బిజినెస్ కూడా భారీ ధరకే జరిగినట్టు తెలుస్తుంది.

Ananya Panday : బికినీతో వలలో చిక్కుకున్న లైగర్ హీరోయిన్

‘పుష్ప’ సినిమా డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ భారీ ధరకి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అమెజాన్ లో ఈ సినిమాను నెల రోజుల తర్వాతే స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం చేసుకున్నారని సమాచారం. అయితే సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉండటం అప్పటికి ‘పుష్ప’ సినిమా రిలీజ్ అయి కూడా నెల అవుతుంది కాబట్టి సంక్రాంతికి ‘పుష్ప’ సినిమాని ఓటిటిలో రిలీజ్ చేస్తే ప్లస్ అవుతుందని ఆశిస్తున్నారు. దీంతో ఈ సినిమాని సంక్రాంతికి ఓటిటిలో రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.