Allu Arjun : తగ్గని పుష్ప క్రేజ్.. మార్కెట్‌లోకి ‘పుష్ప’ చీరలు..

గుజరాత్ లోని సూరత్ క్లాత్ మార్కెట్ కి ఫేమస్ అని అందరికి తెలిసిందే. సూరత్ లోని చరణ్ పాల్ సింగ్ తన క్లాత్ కంపెనీ చరణ్‌జీత్‌ క్లాత్‌ మార్కెట్‌ నుంచి 'పుష్ప' సినిమా పోస్టర్లతో చీరలు...

Allu Arjun :  తగ్గని పుష్ప క్రేజ్.. మార్కెట్‌లోకి ‘పుష్ప’ చీరలు..

Pushpa Sarees (1)

Pushpa :  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయం సాధించి భారీ కలెక్షన్స్ సాధించింది. ‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఈ సినిమాలోని సాంగ్స్, డైలాగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. ‘పుష్ప’ క్రేజ్ ని ప్రతి ఒక్కరూ వాడేసుకుంటున్నారు.

ఇప్పటికే పుష్ప సాంగ్స్, డైలాగ్స్ ని ప్రపంచం నలుమూలల నుంచి సినీ, క్రికెట్, సోషల్ మీడియా సెలబ్రిటీలు రీల్స్ చేస్తున్నారు. ఇక అంతే కాక రాజకీయనాయకులు కూడా పుష్ప క్రేజ్ ని వాడుకుంటూ ప్రమోషన్ చేసుకుంటున్నారు. చిన్న చిన్న వ్యాపార సంస్థలు కూడా తమ ప్రోడక్ట్స్ మీద పుష్ప ఫోటోలు వేసి సేల్ చేస్తున్నారు. పుష్ప ఫొటోలతో చిప్స్‌ ప్యాకెట్స్‌ లాంటి తినుబండారాలు కూడా వచ్చాయి. తాజాగా ‘పుష్ప’ క్రేజ్ తో మరో ప్రోడక్ట్ మార్కెట్ లోకి వచ్చింది.

Allu Arjun : జ్యోతిష్కుల వద్దకు బన్నీ.. కెరీర్ సాఫీగా సాగాలంటే ఈ హోమాలు చేయాల్సిందే..

గుజరాత్ లోని సూరత్ క్లాత్ మార్కెట్ కి ఫేమస్ అని అందరికి తెలిసిందే. సూరత్ లోని చరణ్ పాల్ సింగ్ తన క్లాత్ కంపెనీ చరణ్‌జీత్‌ క్లాత్‌ మార్కెట్‌ నుంచి ‘పుష్ప’ సినిమా పోస్టర్లతో చీరలు రూపొందించారు. పుష్ప సినిమాలోని కొన్ని సన్నివేశాలను, ఫోటోల రూపంలో చీరలపై ముద్రించారు. ఈ కంపెనీ యజమాని చరణ్‌పాల్‌ సింగ్‌కు ఈ ఆలోచన రావడంతో వెంటనే దానిని అమలులో పెట్టేసాడు. ఈ ఆలోచనతో కొన్ని ‘పుష్ప’ చీరలను తయారు చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్‌ మీడియాలో పోస్టుచేశాడు.

Kajol : సీనియర్ హీరోయిన్ డైరెక్షన్‌లో మరో సీనియర్ హీరోయిన్ సినిమా

దీంతో పుష్ప చీరలు వైరల్‌ అవ్వడంతో దేశ వ్యాప్తంగా నార్త్, సౌత్ తేడా లేకుండా చాలా ప్రదేశాల నుంచి పుష్ప చీరల కోసం ఆర్డర్స్ వస్తున్నాయంట చరణ్ పాల్ కంపెనీకి. బాలీవుడ్ మహిళా ప్రేక్షకుల నుంచి పుష్ప చీరల కోసం బాగా ఆర్డర్స్ వస్తున్నాయంట. ఈ పుష్ప చీరలతో చరణ్ పాల్ కూడా ఫేమస్ అయిపోయాడు. మొన్నటిదాకా ఎవరికీ తెలియని చరణ్ పాల్ కోసం మీడియా సంస్థలు వచ్చి ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. మొత్తానికి ‘పుష్ప’ క్రేజ్ చాలా మందికి ఇలా రకరకాలుగా ఉపయోగపడుతుంది.