R Narayanamurthy : సార్ సక్సెస్ మీట్ లో.. యాంకర్ పై ఫైర్ అయిన ఆర్ నారాయణమూర్తి..

సార్ సినిమా సక్సెస్ మీట్ కి ఆర్ నారాయణమూర్తిని గెస్ట్ గా ఆహ్వానించారు. ఈవెంట్ లో నారాయణమూర్తి మాట్లాడుతూ సినిమా సక్సెస్ అయినందుకు స్టేజిపై ఉన్నవారిని, సినిమాలో నటించిన వారిని ఒక్కొక్కరిగా అందర్నీ అభినందించారు. ఇదే క్రమంలో..................

R Narayanamurthy : సార్ సక్సెస్ మీట్ లో.. యాంకర్ పై ఫైర్ అయిన ఆర్ నారాయణమూర్తి..

R Narayanamurthy fires on anchor sravanthi at sir movie success meet

R Narayanamurthy :  ధనుష్, సంయుక్త జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా సార్. చదువుకు ఉన్న విలువ చెప్తూ ఓ మంచి మెసేజ్ ని మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో కలిపి ఈ సినిమాని తెరకెక్కించారు. మొదటి రోజు నుంచే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ధనుష్ సార్ సినిమా మూడు రోజుల్లోనే 51 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి లాభాల్లో దూసుకుపోతుంది.
సార్ సినిమా ప్రతి ఒక్కరికి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. సినిమా మంచి విజయం సాధించడంతో తాజాగా సోమవారం సాయంత్రం చిత్రయూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.

సార్ సినిమా సక్సెస్ మీట్ కి ఆర్ నారాయణమూర్తిని గెస్ట్ గా ఆహ్వానించారు. ఈవెంట్ లో నారాయణమూర్తి మాట్లాడుతూ సినిమా సక్సెస్ అయినందుకు స్టేజిపై ఉన్నవారిని, సినిమాలో నటించిన వారిని ఒక్కొక్కరిగా అందర్నీ అభినందించారు. ఇదే క్రమంలో మొదట యాంకర్ ని కూడా యాంకరింగ్ బాగా చేస్తున్నామంటూ అభినందించారు. ఈ సక్సెస్ మీట్ కి బిగ్ బాస్ ఫేమ్ యాంకర్ స్రవంతి చొకారపు యాంకరింగ్ చేసింది.

Sir Movie : ధనుష్ కెరీర్‌లోనే ‘సార్’ బిగ్గెస్ట్ ఓపెనింగ్.. 3 రోజుల్లో 90 శాతం వచ్చేసింది..

అయితే స్పీచ్ అయ్యాక హైపర్ ఆది గురించి చెప్పడం మర్చిపోవడంతో మరోసారి మైక్ తీసుకొని నారాయణమూర్తి హైపర్ ఆది గురించి మాట్లాడుతుండగా మధ్యలో యాంకర్ మాట్లాడుతూ వేరేవాళ్లని స్టేజి మీదకి పిలిచింది. దీంతో నారాయణమూర్తికి కోపం వచ్చి యాంకర్ ని ఉద్దేశించి సీరియస్ గా.. ఇక్కడ మాట్లాడుతున్నాంగా, స్టేజి మీద ఒకరు మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడకూడదు. సభ్యత నేర్చుకోండి. ప్లీజ్ అంటూ అన్నారు. దీంతో నారాయణమూర్తి యాంకర్ స్రవంతి చొకారపు పై సీరియస్ అయిన వీడియో వైరల్ గా మారింది.