Radhe Shyam: ట్రైలర్‌పై మేకర్స్ క్రేజీ థాట్.. టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్!

ఇప్పుడు సినీ పరిశ్రమలో ఎక్కడ చూసినా రాబోతున్న కొత్త సినిమాల సందడే. అది కూడా చిన్నా చితకా సినిమాలు కాకపోవడం.. కోట్లాది అభిమానులు ఎదురుచూసే సినిమాలు కావడంతో సాధారణ ప్రేక్షకులు..

Radhe Shyam: ట్రైలర్‌పై మేకర్స్ క్రేజీ థాట్.. టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్!

Radhe Shyam

Radhe Shyam: ఇప్పుడు సినీ పరిశ్రమలో ఎక్కడ చూసినా రాబోతున్న కొత్త సినిమాల సందడే. అది కూడా చిన్నా చితకా సినిమాలు కాకపోవడం.. కోట్లాది అభిమానులు ఎదురుచూసే సినిమాలు కావడంతో సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమాల గురించే చర్చించుకుంటున్నారు. ఇందులో అల్లు అర్జున్ పుష్ప, నానీ శ్యామ్ సింగరాయ్ ఈ డిసెంబర్ నెలలోనే వస్తుంటే ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, భీమ్లా నాయక్ జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Unstoppable Aha: ఇది వేరే లెవెల్.. బాలయ్య షోలో జక్కన్న-కీరవాణి!

డిసెంబర్ లో రానున్న పుష్ప, శ్యామ్ సింగరాయ్ ల సందడి ఇప్పటికే మొదలవగా పాటలు, ట్రైలర్లతో ఈ ఇద్దరూ ఓ ఊపు పూపేస్తున్నారు. పుష్ప పాన్ ఇండియా స్థాయిలో వస్తుంటే.. శ్యామ్ సౌత్ అన్ని బాషలలో విడుదల అవుతుంది. ఇక జనవరి సినిమాల విషయానికి వస్తే ఆర్ఆర్ఆర్ మేనియా ఎప్పుడో మొదలై ఇప్పుడు ఇది ఒక రేంజ్ లో పెరిగిపోయింది. జనవరి సినిమాలలో ఆర్ఆర్ఆర్ ట్రైలర్ కూడా రిలీజై దుమ్మురేపగా యూనిట్ వరసపెట్టి భారీ ప్రచార కార్యక్రమాలను చేపడుతుంది. ఇక మిగిలిన రెండు సినిమాలు ఒక్కో అప్డేట్ వదులుతూ మెల్లగా హీట్ పెంచుతున్నాయి.

Rajinikanth: ప్లాప్ దర్శకుడితో సూపర్ స్టార్.. అంత నమ్మకం ఏంటి ‘పెద్దన్నా’?

కాగా, రాధేశ్యామ్ విషయంలో మేకర్స్ ఓ క్రేజీ థాట్ తో ఉన్నట్లు తెలుస్తుంది. భారీ పాన్ ఇండియా సినిమా స్థాయిలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయాలని చూస్తున్న మేకర్స్ సినిమా ట్రైలర్ ను కూడా అప్పుడే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ఇప్పటికే ఒక్కో భాషలో ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్.. ఒక్కో పాటని ఒక్కోరోజున విడుదల చేయడంతో కొందరు అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకే ట్రైలర్స్ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలని.. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో అటెన్షన్ క్రియేట్ చేసి ప్రచారాన్ని మొదలు పెట్టాలని మేకర్స్ ఆలోచనగా కనిపిస్తుంది.

Rashmika Mandanna : షార్ట్ నిక్కర్‌లో ‘సామి.. సామి..’ అంటున్న రష్మిక.. ఇది కూడా ప్రమోషన్స్‌లో భాగమే..

అయితే, అభిమానులు మాత్రం ఈ విషయంలో టెన్షన్ పడుతున్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ముందే ట్రైలర్ విడుదల చేసి సినిమా మీద భారీ అంచనాలను పెంచేసి సినిమా పబ్లిసిటీ మొదలు పెడుతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా ఇది పీక్స్ కి తీసుకెళ్లి సినిమా విడుదల చేస్తున్నారు. అది కూడా వారం ముందే ఈ ఈవెంట్ ఉంటుంది. కనుక అప్పటి వరకు రాధేశ్యామ్ గురించి అప్డేట్స్ లేకపోతే అభిమానులు డిజప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. మరి మేకర్స్ ఈ విషయంలో ఎలా నిర్ణయం తీసుకోనున్నారో చూడాలి.