Radheshyam : అదిరిపోయిన ‘రాధేశ్యామ్’ ప్రీ రిలీజ్ బిజినెస్..

ఈ నేపథ్యంలో 'రాధేశ్యామ్' సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు 200 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ బిజినెస్.......

Radheshyam : అదిరిపోయిన ‘రాధేశ్యామ్’ ప్రీ రిలీజ్ బిజినెస్..

Radheshyam (2)

Radheshyam :  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటించిన ‘రాధేశ్యామ్’ రేపు మార్చ్ 11న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్స్ చూసిన తర్వాత సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఎన్నో వాయిదాల తర్వాత ఈ సినిమా రిలీజ్ అవుతుండటంతో అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆతృతగా ‘రాధేశ్యామ్’ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ‘రాధేశ్యామ్’ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు 200 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..

నైజాం : 36.50 కోట్లు

సీడెడ్ : 18 కోట్లు

ఉత్తరాంధ్ర : 13 కోట్లు

ఈస్ట్ : 8.80 కోట్లు

వెస్ట్ : 7.50 కోట్లు

గుంటూరు : 9.90 కోట్లు

కృష్ణా : 7.50 కోట్లు

నెల్లూరు : 4 కోట్లు

మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి 105.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

కర్ణాటక : 12.50 కోట్లు

తమిళనాడు : 6 కోట్లు

కేరళ : 2.10 కోట్లు

హిందీ : 50 కోట్లు

రెస్టాఫ్ ఇండియా : 3 కోట్లు

ఓవర్సీస్ : 24 కోట్లు

Prabhas : ‘రాధేశ్యామ్’తో సజ్జనార్ ఆర్టీసీ ప్రమోషన్

ప్రపంచ వ్యాప్తంగా ‘రాధేశ్యామ్’ సినిమా మొత్తం 202.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడంతో కలెక్షన్స్ కూడా భారీగా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు సినీ వర్గాలు. మొదటి వారంలోనే ఈ సినిమా దాదాపు 300 కోట్లు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని సమాచారం. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ తో మరో వంద కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉంది.