Radheshyam : ‘రాధేశ్యామ్’ సెకండ్ సాంగ్ టీజర్ రేపే…

తాజాగా ‘రాధేశ్యామ్‌’ నుంచి మరో క్రేజీ అప్‌డేట్‌ వచ్చింది. ఈ చిత్రం నుంచి రెండో సాంగ్‌ విడుదల కాబోతుంది. రేపు 'వన్ హార్ట్.. టూ హార్ట్ బీట్స్..' సాంగ్...............

Radheshyam : ‘రాధేశ్యామ్’ సెకండ్ సాంగ్ టీజర్ రేపే…

Radheshya

Radheshyam :  ‘సాహో’ తర్వాత ప్రభాస్‌ నటించిన మరో పాన్‌ ఇండియా సినిమా ‘రాధేశ్యామ్‌’. కరోనా వల్ల ఈ సినిమా చాలా లేట్ గా వస్తుంది. ఇటీవలే షూటింగ్ ని పూర్తి చేసుకున్న ‘రాధేశ్యామ్’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఈ సినిమా జనవరి 14న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ఓ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌. ప్రభాస్ సొంత బ్యానర్ లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇటలీ నేపథ్యంలో సాగే పీరియాడికల్‌ మిస్టరీ ప్రేమ కథగా ఈ సినిమా ఉండబోతుంది.

Bandla Ganesh : నేపాలీ పాపను దత్తత తీసుకున్న బండ్ల గణేష్

తాజాగా ‘రాధేశ్యామ్‌’ నుంచి మరో క్రేజీ అప్‌డేట్‌ వచ్చింది. ఈ చిత్రం నుంచి రెండో సాంగ్‌ విడుదల కాబోతుంది. రేపు ‘వన్ హార్ట్.. టూ హార్ట్ బీట్స్..’ సాంగ్ టీజర్ రిలీజ్‌ కానుంది. ఇది ‘రాధేశ్యామ్’ లవ్ ఆంథెమ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించారు. ఈ సెకండ్ సాంగ్ హిందీ టీజర్‌ని మధ్యాహ్నం 1 గంటలకు విడుదల చేయగా, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వెర్షన్‌లను రాత్రి 7 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ సాంగ్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.