Rahul Ramakrishna : ఇక సినిమాలు చేయను.. రాహుల్ రామకృష్ణ షాకింగ్ నిర్ణయం

కమెడియన్ గానే కాక మంచి నటుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు రాహుల్ రామకృష్ణ. తరుణ్ భాస్కర్ చేసిన షార్ట్ ఫిలింలో 'సైన్మా'లో లీడ్ రోల్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత..

Rahul Ramakrishna : ఇక సినిమాలు చేయను.. రాహుల్ రామకృష్ణ షాకింగ్ నిర్ణయం

Rahul Ramakrishna

Rahul Ramakrishna :   తెలుగు ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో ట్యాలెంటెడ్ యువ నటులు చాలా మంది వచ్చారు. అందులో రాహుల్ రామకృష్ణ ఒకరు. కమెడియన్ గానే కాక మంచి నటుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు రాహుల్ రామకృష్ణ. తరుణ్ భాస్కర్ చేసిన షార్ట్ ఫిలింలో ‘సైన్మా’లో లీడ్ రోల్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో విజయ్ దేవరకొండకి ఫ్రెండ్ గా నటించి స్టార్ అయ్యాడు. ఆ తర్వాతి నుంచి కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు.

Kajal Agarwal : మొన్న త్రిష.. నిన్న అమలాపాల్.. ఇవాళ కాజల్.. దుబాయ్ గోల్డెన్ వీసా

తాజాగా రాహుల్ పెట్టిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ”2022తో సినిమాలు ఆపేస్తున్నాను. ఇకపై నేను సినిమాలు చేయను. ఎవరేం అనుకున్నా నేను పట్టించుకోను” అని పోస్ట్ చేశాడు. దీంతో ఈ ట్యాలెంటెడ్ కమెడియన్, యాక్టర్ ఇక 2022 తర్వాత నుంచి సినిమాలు చేయదు అని తెలుస్తుంది. కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు ఇలాంటి డెసిషన్ తీసుకోవడం ఏంటి అని అంతా ఆలోచిస్తున్నారు. అయితే ఇది నిజమేనా లేక చాలా మంది లాగే సినిమా కోసం ఏదైనా ప్రమోషనల్ స్టంటా అని కూడా ఆలోచిస్తున్నారు. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.