Rahul Sipligunj : నేను ఏ పరీక్షకైనా సిద్దమే.. రాడిసన్ ఘటనపై స్పందించిన రాహుల్ సిప్లిగంజ్..

తాజాగా రాహుల్ ఈ సంఘటనపై స్పందించాడు. రాహుల్ మాట్లాడుతూ.. ''నిన్న పార్టీలో నేను ఎటువంటి డ్రగ్స్ తీసుకోలేదు. కావాలంటే నేను ఏ పరీక్షకైనా సిద్దమే, చెక్ చేసుకోండి. అసలు అది డ్రగ్స్.....

Rahul Sipligunj : నేను ఏ పరీక్షకైనా సిద్దమే.. రాడిసన్ ఘటనపై స్పందించిన రాహుల్ సిప్లిగంజ్..

Rahul

 

Rahul Sipligunj :  హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్‌ బ్లూ హోటల్‌పై నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు దాడులు చేశారు. సమయం దాటిన తర్వాత కూడా నిర్వహిస్తున్నారనే సమాచారంతో రాడిసన్‌ బ్లూ హోటల్‌లో నిర్వహిస్తున్న ఫుడింగ్‌ మింగ్‌ పబ్‌పై రైడ్‌ చేశారు. ఆ సమయంలో పోలీసులు వెళ్లేసరికి దాదాపు 150 మంది యువతీ యువకులు తాగుతూ, తూగుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు. అయితే అక్కడ డ్రగ్స్ కూడా బయటపడటంతో పబ్‌ నిర్వాహకులతో పాటు 150 మంది యువతీయువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

దీంట్లో చాలా మంది ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారు. కొంతమందికి నోటీసులు ఇచ్చి రాత్రే పంపించగా, మరికొంతమందిని విచారించి ఉదయం పంపించారు. ఇందులో సినీ, రాజకీయ ప్రముఖుల పిల్లలు ఉండటంతో ఈ వార్త సంచలనంగా మారింది. ఈ సంఘటనలో పలువురి పేర్లు బయటకి రాగా అందులో ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పేరు కూడా ఉంది. నిన్న రాత్రి రాహుల్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నోటీసులు ఇచ్చి పంపించేశారు. దీంతో రాహుల్ పైన ఈ సంఘటనలో అనేక వార్తలు వస్తున్నాయి.

Nagababu : రాడిసన్ ఘటనపై స్పందించిన నాగబాబు

తాజాగా రాహుల్ ఈ సంఘటనపై స్పందించాడు. రాహుల్ మాట్లాడుతూ.. ”నిన్న పార్టీలో నేను ఎటువంటి డ్రగ్స్ తీసుకోలేదు. కావాలంటే నేను ఏ పరీక్షకైనా సిద్దమే, చెక్ చేసుకోండి. అసలు అది డ్రగ్స్ పార్టీ అని తెలియదు. తెలిస్తే వెళ్ళేవాడిని కాదు. ఫ్రెండ్ బర్త్ డే కావడంతో సన్నిహితులతో కలిసి పబ్ కి వెళ్ళాను. నేను గతంలో డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో కూడా పాల్గొన్నాను. నేను ఏ తప్పు చేయకపోయినా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.” అని తెలిపారు.