Rajamouli : అదే నా చివరి సినిమా : రాజమౌళి

రాజమౌళి గతంలోనే 'మాహాభారతం' ఆయన డ్రీం ప్రాజెక్టు అని తెలిపారు. ఇప్పుడు ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియచేసారు. రాజమౌళి ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ''మహాభారతం..........

Rajamouli : అదే నా చివరి సినిమా : రాజమౌళి

Rajamouli

Rajamouli :    రాజమౌళి ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో పాన్ ఇండియా అంతా ఎదురు చూసే సినిమా తీశాడు రాజమౌళి. ‘బాహుబలి’తో తనని ప్రపంచ వ్యాప్తంగా గుర్తించేలా చేశాడు రాజమౌళి. అంతే కాక తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాడు. ఇప్పుడు దేశంలోని గొప్ప డైరెక్టర్స్ లో రాజమౌళి ఒకరు. అన్ని సినీ పరిశ్రమల నుంచి చాలా మంది హీరోలు, హీరోయిన్స్ రాజమౌళితో కలిసి పని చేయాలి అని అనుకుంటున్నారు.

ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న రాజమౌళి వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడం, మీడియాతో మాట్లాడటం చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలలో రాజమౌళి తన చిరకాల స్వప్పం ‘మహాభారతం’ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. రాజమౌళి గతంలోనే ‘మాహాభారతం’ ఆయన డ్రీం ప్రాజెక్టు అని తెలిపారు. ఇప్పుడు ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియచేసారు.

Prabhas : ప్రీ రిలీజ్ ఈవెంట్లో గాయపడిన అభిమానులకి సాయమందించిన ప్రభాస్

రాజమౌళి ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ”మహాభారతం నా కెరీర్‌లో చివరి సినిమా అవుతుంది. మహాభారతం తర్వాత నేను రిటైర్ అవుతాను. అయితే మహాభారతం సినిమా ఒకటి, రెండు కాకుండా ఎక్కువ పార్టుల్లో రిలీజ్ అవుతుంది. మహాభారతం చిత్రంలో దేశంలోని అగ్ర నటులందరూ కలిసి నటించేలా చేస్తాను. సినిమా చరిత్రలో చిరకాలం నిలిచిపోయేలా ఆ సినిమా ఉంటుంది. అందుకు సంబంధించిన స్క్రిప్టు పనులు చాలా నెమ్మదిగా జరుగుతున్నా నా కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా నిలిచిపోయేలా మహాభారతం సినిమాని నిర్మిస్తాను” అని తెలిపారు.