Rajamouli : దేవాలయాలు అద్భుతం, తమిళ్ ఫుడ్ సూపర్ అంటూ.. తమిళనాడు ట్రిప్‌పై రాజమౌళి స్పెషల్ పోస్ట్..

ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి వెకేషన్ కోసం రాజమౌళి తమిళనాడు వెళ్లారు. అక్కడ టెంపుల్స్, బీచ్, రిసార్ట్స్ లలో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేశాడు జక్కన్న. ఇటీవలే ఆ ట్రిప్ నుంచి తిరిగి వచ్చిన రాజమౌళి తాజాగా తమిళనాడుని పొగుడుతూ ట్వీట్ చేశాడు.

Rajamouli : దేవాలయాలు అద్భుతం, తమిళ్ ఫుడ్ సూపర్ అంటూ.. తమిళనాడు ట్రిప్‌పై రాజమౌళి స్పెషల్ పోస్ట్..

Rajamouli special tweet on Tamilanadu Trip and praising Tamil Temples and Food

Rajamouli Tamilanadu Trip :  రాజమౌళి.. బాహుబలి(Bahubali)తో దేశవ్యాప్తంగా పేరు సంపాదించి RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఇక నాటు నాటు(Naatu Naatu) సాంగ్ కి ఆస్కార్(Oscar) అవార్డు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించారు. హాలీవుడ్(Hollywood) టాప్ డైరెక్టర్స్, టెక్నీషియన్స్ కూడా రాజమౌళి పనితనాన్ని మెచ్చుకున్నారు. ఇండియన్ టాప్ డైరెక్టర్స్ లో రాజమౌళి ఒకరు. ఇన్నాళ్లు RRR సినిమాతో బిజీగా ఉన్న రాజమౌళి నెక్స్ట్ మహేష్( తో సినిమా చేయబోతున్నాడు.

ఈ గ్యాప్ లో ఫ్యామిలీకి సమయం కేటాయించారు జక్కన్న, ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లారు. రాజమౌళి, రమా రాజమౌళి, కొడుకు, కోడలు, కూతురు.. మరికొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి వెకేషన్ కోసం రాజమౌళి తమిళనాడు వెళ్లారు. అక్కడ టెంపుల్స్, బీచ్, రిసార్ట్స్ లలో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేశాడు జక్కన్న. ఇటీవలే ఆ ట్రిప్ నుంచి తిరిగి వచ్చిన రాజమౌళి తాజాగా తమిళనాడుని పొగుడుతూ ట్వీట్ చేశాడు.

BiggBoss 7 : బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 7 వచ్చేస్తుంది.. అఫీషియల్ అనౌన్స్..

తమిళనాడులో దిగిన ఫోటోలని ఓ వీడియోలా మార్చి దాన్ని షేర్ చేస్తూ.. చాలా కాలంగా సెంట్రల్ తమిళనాడులో రోడ్ ట్రిప్ చేయాలనుకున్నాను. నా కూతురు తమిళనాడు దేవాలయాలను సందర్శించాలనుకునే నా కుమార్తె ఆలోచనకు చాలా థ్యాంక్స్. జూన్ చివరి వారంలో మేము ట్రిప్ కి వెళ్ళాము. శ్రీరంగం, దారాసురం, బృహదీశ్వర కోయిల్, రామేశ్వరం, కణాదుకథాన్, తూత్తుకుడి మరియు మదురైకి వెళ్ళాను. నాక్కూడా ఉన్న ప్రతి దేవాలయంలో అద్భుతమైన వాస్తుశిల్పం, అద్భుతమైన ఇంజనీరింగ్ పనితనం కనిపించాయి.

పాండ్యులు, చోళులు, నాయకర్లు మరియు అనేక ఇతర పాలకులు వారి లోతైన ఆధ్యాత్మిక ఆలోచనలు నిజంగా మంత్రముగ్ధులను చేశాయి. మంత్రకూడం, కుంభకోణంలో చక్కటి భోజనం చేసినా, రామేశ్వరంలోని కాకా హోటల్ మురుగన్ మెస్‌లో భోజనం చేసినా అన్ని చోట్లా భోజనం అద్భుతంగా ఉంది. నేను ఈ ట్రిప్ వారంలో 2-3 కిలోలు పెరిగాను. 3 నెలల విదేశీ ప్రయాణం, ఆహారం తర్వాత ఈ హోమ్ ల్యాండ్ టూర్ చాలా రిఫ్రెష్‌గా మరియు ఉత్సాహంగా ఉంది అని పోస్ట్ చేశారు రాజమౌళి. దీంతో రాజమౌళి తమిళనాడుపై పొగుడుతూ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.