Rajinikanth : స్టైల్ అంటే రజనీకాంత్.. రజనీకాంత్ అంటే స్టైల్.. రజిని బర్త్‌డే స్పెషల్..

స్టైల్ అంటే రజనీకాంత్.. రజనీకాంత్ అంటే స్టైల్.. రజనీకాంత్‌ తలతిప్పినా, కాలు కదిపినా సంచలనమే. సూపర్ స్టార్ రజనీకాంత్ స్టైల్ కి, ఆయన డైలాగ్స్‌కి ఫిదా అవ్వని వాళ్లు ఎవరూ ఉండరు. ఆయన నడిచినా.. కాలర్ ఎగరేసినా.. కూర్చున్నా........................

Rajinikanth : స్టైల్ అంటే రజనీకాంత్.. రజనీకాంత్ అంటే స్టైల్.. రజిని బర్త్‌డే స్పెషల్..

Rajinikanth Birthday Special Story

Rajinikanth :  స్టైల్ అంటే రజనీకాంత్.. రజనీకాంత్ అంటే స్టైల్.. రజనీకాంత్‌ తలతిప్పినా, కాలు కదిపినా సంచలనమే. సూపర్ స్టార్ రజనీకాంత్ స్టైల్ కి, ఆయన డైలాగ్స్‌కి ఫిదా అవ్వని వాళ్లు ఎవరూ ఉండరు. ఆయన నడిచినా.. కాలర్ ఎగరేసినా.. కూర్చున్నా.. సిగరేట్ కాల్చినా ప్రతిదీ స్టైల్ గా ఉంటుంది. మేనరిజంతోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న తలైవర్..తమిళ్ సూపర్ స్టారే కాదు.. పాన్ ఇండియా స్టార్ గా ఎప్పుడో ఎదిగారు. నేడు ఆయన 72 వ పుట్టినరోజు.

ఈ మధ్య కొత్తగా పాన్ ఇండియా స్టార్ అన్న పదం ఫేమస్ అయిపోయింది కానీ నిజానికి పాన్ ఇండియా స్టార్ గా సౌత్ సినిమాకి క్రేజ్ తీసుకొచ్చింది రజనీకాంత్. సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాకపోయినా సౌత్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉన్నారు రజనీకాంత్. తన స్టైల్ తో, మేనరిజమ్స్ తో బాలీవుడ్ లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని నార్త్ లో కూడా సౌత్ సత్తా చూపించారు సూపర్ స్టార్ రజనీకాంత్.

రజిని స్టైల్ గా సిగరెట్ కాల్చే ఒక్క సీన్ తోనే కోట్ల మంది ప్రేక్షకులు ఆయనకు డై హార్డ్ ఫాన్స్ అయిపోయారు. సిగరెట్ అలవాటు ఉన్నవాళ్ళంతా ఆయనలా ఒక్కసారన్నా కచ్చితంగా ట్రై చేసే ఉంటారు. 72 ఏళ్లవయసులో ఉన్నా ఇంకా 40 ఏళ్లే ఉన్నట్టు కనిపించడం ఆయనకే సాధ్యం. లేస్తే కూర్చోలేని వయసులో విలన్లతో ఫైట్లు, హీరోయిన్లతో డ్యూయెట్లు, పోటీపడి డ్యాన్సులు చెయ్యడం ఈజీయేనా..? నార్మల్ జనానికైతే ఇది కష్టమేమో కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ కి మాత్రం కాదంటారు ఫ్యాన్స్. అందుకే 72 ఏళ్ల వయసులో కూడా జైలర్ లాంటి యాక్షన్ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు.

 

రజనీకాంత్.. సౌత్ సూపర్ స్టార్.. తమిళ్ తలైవా.. స్టైల్ ఐకాన్.. ఇలా ఆ హీరోని ఎన్ని పేర్లతో పిలిచినా తక్కువే. ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లు దాటినా, 72 ఏళ్ల వయసులో ఇంకా అదే ఎనర్జీతో ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్నారు. ఇప్పటికీ ఇండస్ట్రీలో ఎవ్వరికీ లేనంత ఇమేజ్ రజనీకాంత్ కి ఉంది. ఫస్ట్ సౌత్ హీరో అయినా కానీ రజనీకాంత్ కి సౌత్ లోనే కాకుండా పాన్ ఇండియా వైడ్ గా మంచి మాస్ ఇమేజ్ ఉంది. ఈ ఎనర్జీ తోనే ఇండియా వైడ్ ఫాన్స్ కి ఇంకా ఫేవరెట్ స్టార్ గా కంటిన్యూ అవుతున్నారు.

పంచ్ డైలాగ్స్ రజినీ నోట వింటే థియేటర్లలో విజిల్స్, క్లాప్స్ మారుమోగుతాయి. ఇలాంటి స్టైల్స్‌ ఇండియన్‌ స్క్రీన్‌పై మరెవ్వరికీ సాధ్యం కాదు, ఒక్కరజనీకాంత్ కి తప్ప. 72ఏళ్ల వయసొచ్చినా ఆయన ఇప్పటికీ ఇండియన్ సూపర్ స్టారే. అదే స్టైల్, అదే మాస్ అప్పీయరెన్స్ తో అదరగొడుతోన్న రజనీకాంత్ స్క్రీన్ మీద ఇంకా ఎవర్ యంగ్ ఎనర్జిటిక్ గా కనిపిస్తూనే ఉంటారు. ఇంకా అదే స్పీడ్ తో సినిమాలు అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. ఆల్రెడీ జైలర్ తో బిజీగా ఉన్న రజనీ లేటెస్ట్ గా మరో 2 సినిమాల్ని అనౌన్స్ చేశారు.

ఎంత పెద్ద స్టార్ హీరో అయినా, ఎన్ని సినిమాలు చేసినా, ఎన్ని కోట్లు కలెక్షన్లు సాధించినా ఇవేవీ పట్టించుకోని రజనీకాంత్ కి ఆ సింప్లిసిటీనే ఇంత ఇమేజ్ ని సంపాదించి పెట్టింది. ఏ ఇండియన్ సూపర్ స్టార్ కూ లేనంత ఇమేజ్ రజనీకాంత్ సొంతం. ఏ హీరో కైనా ఫ్లాఫ్ వస్తే క్రేజ్ తగ్గుతుంది. కానీ రజనీకి మాత్రం వరసగా ఫ్లాపులున్నా, వయసు పెరుగుతున్నా క్రేజ్ లో ఏమాత్రం మార్పులేదు. ఆయన సినిమాల రిజల్ట్ తో సంబందం లేకుండా అభిమానాన్ని ఇంకా చూపిస్తూనే ఉన్నారు ఆయన హార్ట్ కోర్ ఫాన్స్. ఈ మధ్య సక్సెస్ లు కాస్త్ స్లో అయినా, వరసగా ఫ్లాపులొస్తున్నా కూడా ఇమేజ్ లో ఏమాత్రం మార్పు లేదు. అందుకే ఇండియన్ స్టారే కాదు, ఇంటర్నేషనల్ స్టార్ కూడా అయ్యారు రజనీకాంత్. సాధారణంగా రజనీకాంత్ సినిమాలన్నీ కేవలం ఆయనకు ఉన్న స్టార్ ఇమేజ్ తోనే బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు కొల్లగొడుతూ ఉంటాయి. అందుకే సినిమాకు పని చేసే వారిలో అందరికంటే రజనీకాంత్ రెమ్యూనరేషనే ఎక్కువగా ఉంటుంది. అయినా సరే రజనీ డేట్స్ ఎప్పుడూ ఖాళీ ఉండవు.

రజనీకాంత్ కి ఉన్న బిగ్గెస్ట్ స్రెన్త్ ఆయన అభిమానులు. దేశంలో ఎవ్వరికీ లేనన్ని ఫ్యాన్ క్లబ్ లు తలైవా సొంతం. జస్ట్ చిన్న పిలుపుతో అలర్ట్ అయ్యే అభిమానులు ఉన్న రజనీకాంత్ అభిమానులకు చాలా వాల్యూ ఇస్తారు. ఆయన సినిమాలంటే పడిచచ్చిపోయే ప్రేక్షకులు ఇండియాలోనే కాదు ఫారెన్ లో కూడా ఉన్నారు. అందుకే ఆయన సినిమాలను ఇండియాలోనే కాకుండా జపాన్, చైనా, మలేషియా లాంటి దేశాల్లో కూడా రిలీజ్ చేస్తారు.

Prabhas in Unstoppable Show : బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో ప్రభాస్, గోపీచంద్..

సౌత్ ఇండియన్ సినిమాలోనే హయ్యస్ట్ పెయిడ్ యాక్టర్ రజనీకాంత్. టోటల్ సినిమా ఖర్చు కంటే రజనీ రెమ్యూనరేషన్ కే ఎక్కువ ఖర్చవుతుంది .అయినా సరే రజనీని తీస్కుంటున్నారంటే ఆయన రేంజ్ ఏంటో అర్దం చేస్కోవచ్చు. గత కొన్నేళ్లుగా తమిళ్ లోనే అత్యధిక ట్యాక్స్ కడుతున్న సెలబ్రిటీ కూడా రజినీకాంతే. 72 ఏళ్ల ఈ సూపర్ స్టార్ స్టిల్ స్టూడెంటే. డైరెక్టర్ చెప్పింది చెప్పినట్లు చేస్తాడు. ఈ వయసులో కూడా ఏ విషయమైనా నేర్చుకోడానికి ముందుంటారు. శరీరం సరిగా సహకరించకపోయినా సినిమాకు అవసరమైన ఎలిమెంట్స్ అన్నీ నేర్చుకుంటారు. రోబో సినిమాకు ఎక్స్ ట్రా మేకప్ అవసరం అయినా, శివాజీ సినిమాలో డిఫరెంట్ గా కనిపించినా.. ఇలా సినిమా మేకింగ్ కు ఎంత టైమ్ పట్టినా ఓపికగా ఉంటారు రజనీ.

అందుకే రజినీకాంత్ హీరోగా, స్టార్ గా ఎదిగి కోట్ల మంది అభిమానులని సంపాదించుకున్నారు. అయన స్టైల్ ని ఎవరూ మ్యాచ్ చేయలేరు. ఏజ్ పెరిగినా ఆయన స్టైల్ మాత్రం మారదు. నేడు రజిని పుట్టిన రోజు కావడంతో అభిమానులు, సెలబ్రిటీలు ఆయనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలో రజినీకాంత్ జైలర్ సినిమాతో రానున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.