Peddanna : ట్రైలర్ అదిరింది.. బొమ్మ పక్కా బ్లాక్‌బస్టర్..

సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్.. దాదాసాహెబ్ ఫాల్కే రజినీకాంత్ ‘పెద్దన్న’ ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది..

Peddanna : ట్రైలర్ అదిరింది.. బొమ్మ పక్కా బ్లాక్‌బస్టర్..

Peddanna

Peddanna: సూపర్‌స్టార్, దాదాసాహెబ్ ఫాల్కే రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అన్నాత్తే’. ‘సిరుత్తై’ శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. నయనతార హీరోయిన్‌. కీర్తి సురేష్- తలైవా చెల్లెలిగా కనిపించనుంది.

Annaatthe : రజినీ కోసం బాలు పాడిన చివరి సాంగ్ ఇదే..

అప్పటి స్టార్ హీరోయిన్లు మీనా, ఖుష్బూ కీలకపాత్రల్లో నటించారు. జగపతి బాబు, అభిమన్యు సింగ్, ప్రకాష్ రాజ్ నెగెటివ్ రోల్స్ చేశారు. ‘అన్నాత్తే’ ను తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో రిలీజ్ చెయ్యనున్నారు. ఇప్పటివరకు విడుదల చేసిన ప్రోమోలు సినిమా మీద అంచనాలు పెంచాయి.

Annaatthe : రజినీ – నయనతారల పెయిర్ అదిరిందిగా

బుధవారం ‘పెద్దన్న’ ట్రైలర్ వదిలారు. బాక్సాఫీస్ వద్ద సూపర్‌స్టార్ స్టామినా ఏంటనేది మరోసారి నిరూపించేలా.. బొమ్మ పక్కా హిట్ అనేలా ఉంది ట్రైలర్. రజినీ స్టైల్, మేనరిజమ్స్, డైలాగ్స్‌ సింప్లీ సూపర్బ్. సిస్టర్ సెంటిమెంట్ అండ్ ఎమోషన్స్ హైలెట్‌గా తెరకెక్కిన ‘పెద్దన్న’ దీపావళి కానుకగా నవంబర్ 4న తెలుగు, తమిళ్‌లో భారీ స్థాయిలో విడుదల కానుంది.