Ram Charan : స్నేహితుడు పెళ్లి చేసి రిటర్న్ అయ్యిన రామ్‌చరణ్.. పెళ్ళిలోని చరణ్ ఫొటోలతో మీమ్స్..
శర్వానంద్ పెళ్ళికి హాజరయిన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ రామ్ చరణ్ అండ్ విక్రమ్ రెడ్డి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక చరణ్‌తో శర్వా ఉన్న ఫోటోలను కొందరు మీమ్స్ చేస్తూ..
Ram Charan – Sharwanand : టాలీవుడ్ హీరో శర్వానంద్ కూడా ఎట్టకేలకు పెళ్లి చేసేసుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన రక్షిత రెడ్డి అనే అమ్మాయిని నిశ్చితార్ధం చేసుకున్నాడు. రక్షిత.. మాజీ మంత్రి అయిన టీడీపీ నేత స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి మనవరాలు మరియు హైకోర్టు లాయర్ మధుసూధనా రెడ్డి కూతురు. కాగా ఇండస్ట్రీలో రామ్ చరణ్ అండ్ శర్వానంద్ మంచి స్నేహితులని అందరికి తెలిసిన విషయం. ఇక శర్వా అండ్ రక్షిత ఎంగేజ్మెంట్ కి ఉపాసనతో (Upasana) కలిసి చరణ్ హాజరు కాగా ఆ ఫోటోలు అప్పుడు బాగా వైరల్ అయ్యాయి.
Bhola Shankar : భోళా శంకరుడి మ్యానియా షురూ.. ఫస్ట్ సింగల్ లిరికల్ సాంగ్ రిలీజ్!
తాజాగా వీరిద్దరి వివాహం జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో గ్రాండ్ గా జరిగింది. ఇక ఈ పెళ్ళికి శర్వా ఇద్దరి బెస్ట్ ఫ్రెండ్స్ అయిన చరణ్ అండ్ విక్రమ్ హాజరయ్యి సందడి చేశారు. రెండు రోజులు పాటు జరిగిన ఈ పెళ్లి వేడుక.. జూన్ 2న హల్దీ, మెహందీ అండ్ కాక్టైల్ వేడుకలు జరిగాయి. ఇక కాక్టైల్ పార్టీకి హాజరయిన చరణ్ అండ్ విక్రమ్ సందడి చేశారు. జూన్ 3 రాత్రి 11 గంటలకు శర్వానంద్, రక్షిత మేడలో మూడు ముళ్ళు వేశాడు. ఇక ఈ పెళ్లి సమయంలోని చరణ్, శర్వా ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆ ఫోటోలను కొందరు మీమ్స్ చేసి పోస్ట్ చేస్తుండగా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ రెండు రోజులు స్నేహితుడి పెళ్లిలో ఎంజాయ్ చేసిన రామ్ చరణ్.. నేడు హైదరాబాద్ రిటర్న్ అయ్యాడు. జైపూర్ ఎయిర్ పోర్ట్ నుంచి చరణ్ రిటర్న్ అవుతున్న వీడియోలో నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.