Ram Charan : అర్ధరాత్రి చరణ్ ఇంట్లో బర్త్‌డే వేడుకలు.. వీడియో షేర్ చేసిన ఎన్టీఆర్..

ఈ పుట్టిన రోజుకి సంబంధించిన చిన్న వీడియోని ఎన్టీఆర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ వీడియోలో.. ''చరణ్‌కి విషెష్ చెప్తూ, కేక్ కట్ చేయించి చరణ్, తారక్, రాజమౌళి ముగ్గురు...

Ram Charan : అర్ధరాత్రి చరణ్ ఇంట్లో బర్త్‌డే వేడుకలు.. వీడియో షేర్ చేసిన ఎన్టీఆర్..

Charan Birthday

Ram Charan :  ఈ రోజు మార్చి 27న మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ పుట్టినరోజు. మెగా అభిమానులకి పండగ రోజు. ఇప్పటికే చాలా మంది అభిమానులు, సెలబ్రిటీలు తమ స్టైల్‌లో చరణ్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా ఎన్టీఆర్ కూడా చరణ్‌కి బర్త్‌డే విషెష్ తెలిపాడు. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్‌లో రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘నా ప్రతి బర్త్‌డేకి అర్థరాత్రి తారక్ నా దగ్గరికి వస్తాడు, ఇద్దరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం” అని చెప్పాడు.

 

ఈ సారి కూడా నిన్న రాత్రి తారక్ చరణ్ ఇంటికి వచ్చాడు. అయితే ఈ సారి ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ మూడ్‌లో ఉండటంతో చరణ్ బర్త్‌డే వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ బర్త్‌డే వేడుకలకి ఎన్టీఆర్, ప్రణతి, రాజమౌళి, అతని ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ అంతా పాల్గొన్నారు. ఒక పార్టీలా అందరు కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ పుట్టిన రోజుకి సంబంధించిన చిన్న వీడియోని ఎన్టీఆర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ వీడియోలో.. ”చరణ్‌కి విషెష్ చెప్తూ, కేక్ కట్ చేయించి చరణ్, తారక్, రాజమౌళి ముగ్గురు తినిపించుకొని, ఆ తర్వాత ముగ్గురు కౌగలించుకొని ఎగురుతూ ఎంజాయ్ చేశారు. లాస్ట్‌లో చరణ్ మాట్లాడుతూ చాలా సంవత్సరాలు ఎన్టీఆర్ ప్రణతిని వదిలేసి నా బర్త్‌డేకి వస్తున్నాడు థ్యాంక్స్” అంటూ చెప్పాడు.

RRR : ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ పార్టీ

ఇక ఈ వీడియోతో పాటు ‘ఆర్ఆర్ఆర్’ టైంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ షర్ట్ గుండీలు పెడుతున్న ఫోటోని షేర్ చేసి.. ”పుట్టిన రోజు శుభాకాంక్షలు బ్రదర్. నువ్వు నా పక్కన ఉండటం నా అదృష్టం. మనం ఇలాగే కలిసి మరిన్ని మెమరీలు షేర్ చేసుకోవాలి” అంటూ పోస్ట్ చేశాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో, ఫోటో వైరల్ అవుతున్నాయి.