Ram Charan : ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం పని చేసిన వారికి బంగారం బహుమతిగా ఇచ్చిన చరణ్

తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మంచితనాన్ని మరోసారి చాటుకున్నారు. 'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం పని చేసిన వివిధ శాఖలకు చెందిన వారిని ఈ ఉదయం అల్పాహారం కోసం పిలిపించి.........

Ram Charan : ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం పని చేసిన వారికి బంగారం బహుమతిగా ఇచ్చిన చరణ్

Ram Charan

RRR :  ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ కి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం ఎనిమిది రోజుల్లోనే ఏడు వందల కోట్లకు పైగా వసూలు చేసి కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా ఇంత సక్సెస్ కావడంతో ఒకపక్క హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య సహా సినిమాలో భాగమైన అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

మెగాస్టార్ బాటలో మెగా పవర్ స్టార్ కూడా మంచి పనులు చేయటానికి, తన కోసం పని చేసిన వారిని అభినందించడానికి ఎప్పుడూ ముందుంటారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మంచితనాన్ని మరోసారి చాటుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం పని చేసిన వివిధ శాఖలకు చెందిన వారిని ఈ ఉదయం అల్పాహారం కోసం పిలిపించి వారందరికి ఊహించని బహుమతి అందించారు. సినిమా కోసం పని చేసిన వివిధ విభాగాల అధిపతులను, కెమెరా అసిస్టెంట్లను, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి చెందిన వారిని, మేనేజర్లను, అకౌంటెంట్లను, స్టిల్ ఫోటోగ్రాఫర్ లని.. ఇలా దాదాపు అన్ని విభాగాలకు చెందిన సుమారు 35 మందిని ఇంటికి అల్పాహారం కోసం పిలిపించారు.

Balakrishna : అభిమానుల కోరిక మేరకు.. మళ్ళీ థియేటర్లోకి ‘అఖండ’

వారితో కాస్త సమయం గడిపిన రామ్ చరణ్ అందరికి అల్పాహారం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వారందరికీ ఒక్కొకరికి ఒక్కో తులం బంగారం కాయిన్ కానుకగా ఇచ్చారు. ఆ కాయిన్ మీద రామ్ చరణ్ అని రాసి ఉంది. దీనితో పాటు వారికి ఒక కేజీ స్వీట్ బాక్స్ కూడా అందించి సినిమా కోసం పని చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత అందరికి ఓపికగా ఫోటోలు ఇచ్చారు. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ.. సినిమా ఇంత అద్భుతంగా రావడంలో వారి పాత్ర కూడా ఉందని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. రామ్ చరణ్ చేసిన పనికి వారితో పాటు అభిమానులు, ప్రేక్షకులు చరణ్ ని అభినందిస్తున్నారు.