Ram Charan : నాటు నాటు పాట వల్ల నాలుగు కిలోల బరువు తగ్గాను.. రామ్ చరణ్

చరణ్ అయితే అమెరికాలో రోజుకొక మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. ఈ ఇంటర్వ్యూలలో చరణ్ RRR సినిమా, నాటు నాటు సాంగ్ తో పాటు ఇండియన్ సినిమా, తన ఫ్యామిలీకి సంబంధించిన సంగతులు కూడా పంచుకుంటున్నాడు. తాజాగా ఎంటర్‌టైన్‌మెంట్‌ టునైట్‌ అనే ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో..................

Ram Charan : నాటు నాటు పాట వల్ల నాలుగు కిలోల బరువు తగ్గాను.. రామ్ చరణ్

Ram Charan says he loss weight during shooting of naatu naatu song

Ram Charan :  ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో RRR సినిమా నుంచి నాటు నాటు సాంగ్ నిలిచిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా RRR యూనిట్ హాలీవుడ్ లోని పలు సినిమా ఈవెంట్స్ కి హాజరవుతూ, సినిమాని మరింత ప్రమోట్ చేస్తూ బిజీగా ఉన్నారు. రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్, ఎన్టీఆర్, సెంథిల్ కుమార్, మరికొంతమంది చిత్రయూనిట్ అమెరికాలో సందడి చేస్తున్నారు. అక్కడి మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ RRR సినిమా గురించి, నాటు నాటు సాంగ్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేస్తున్నారు.

ఇక చరణ్ అయితే అమెరికాలో రోజుకొక మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. ఈ ఇంటర్వ్యూలలో చరణ్ RRR సినిమా, నాటు నాటు సాంగ్ తో పాటు ఇండియన్ సినిమా, తన ఫ్యామిలీకి సంబంధించిన సంగతులు కూడా పంచుకుంటున్నాడు. తాజాగా ఎంటర్‌టైన్‌మెంట్‌ టునైట్‌ అనే ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాటు నాటు సాంగ్ గురించి మాట్లాడాడు.

Viranica Manchu : లండన్‌లో లగ్జరీ ఫ్యాషన్ మాల్ ఓపెన్ చేసిన మంచు విష్ణు వైఫ్..

చరణ్ మాట్లాడుతూ.. ఇప్పుడు నాటు నాటు పాట మాది మాత్రమే కాదు ప్రపంచంలోని ప్రేక్షకులందరిది. ఆ పాటలోని సాహిత్యం అర్థంకాకపోయినా అందరూ ఆ బీట్ ని బాగా ఎంజాయ్ చేశారు. జపాన్ నుంచి అమెరికా వరకు అందరూ నాటు నాటు పాటకు స్టెప్పులు వేశారు. ఇంతకు మించి నేనేమి కోరుకోవట్లేదు. ఉక్రెయిన్ అధ్యక్ష భవనం ముందు ఈ పాటని షూట్ చేశాం. ఆ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా ఒకప్పుడు నటుడు కావడంతో షూటింగ్ కి తొందరగా పర్మిషన్ ఇచ్చారు. ఈ పాటలో దాదాపు 150 మంది డ్యాన్సర్లు పాల్గొన్నారు. దాదాపు 200 మంది టెక్నీషియన్స్ పనిచేశారు. ఈ పాటని తీయడానికి 17 రోజులు పట్టింది. కొన్ని స్టెప్పులకు నేను, ఎన్టీఆర్ ఒకేలా చేయడానికి చాలా టేక్స్ తీసుకున్నాం. ఈ పాట అయ్యేసరికి నేను నాలుగు కిలోల బరువు తగ్గాను. అంతగా ఈ పాట కోసం కష్టపడ్డాము. అది తలుచుకుంటే ఇప్పటికి కూడా నా కాళ్ళు వణుకుతాయి అని అన్నారు. ఇక నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలవాలని అంతా కోరుకుంటున్నారు.