KONDA : తెలంగాణ ‘రక్తచరిత్ర’

కొండా సురేఖ – మురళి దంపతుల బయోపిక్ మూవీకి ‘కొండా’ టైటిల్ ఫిక్స్ చేసిన రామ్ గోపాల్ వర్మ..

KONDA : తెలంగాణ ‘రక్తచరిత్ర’

Konda

KONDA: గతకొద్ది కాలంగా బోల్డ్ కంటెంట్ లేదా బయోపిక్స్‌తోనే సినిమాలు చేస్తున్న వర్మ ఇప్పుడు మరో క్రేజీ బయోపిక్‌కి రంగం సిద్ధం చేసాడు. అందుకోసం ఆయన సీక్రెట్‌గా వరంగల్‌లో పర్యటించారు. కొండా సురేఖ – మురళి దంపతుల బయోపిక్ చెయ్యడానికి వర్మ, వరంగల్‌లోని LB కళాశాలలో సిబ్బంది మరియు అధ్యాపకులను కలిసి కొంత సమాచారం సేకరించిన సంగతి తెలిసిందే.

Konda

 

వరంగల్‌లో కొండా సురేఖ – మురళి దంపతులకు రాజకీయంగా మంచి పేరు, పలుకుబడి ఉంది. వరంగల్ రాజకీయాల్లో వారు ఓ వెలుగు వెలిగారు. ఈ కాలేజీలో చదువుకునే సమయంలోనే సురేఖ – మురళీ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకథ నుంచి రాజకీయ ప్రస్థానం వరకు బయోపిక్‌గా తెరకెక్కించబోతున్నాడు వర్మ.

Konda

 

రీసెంట్‌గా ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. 80వ దశకంలో జరిగిన ప్రేమకథతో నక్సల్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిస్తున్న ఈ బయోపిక్‌కి ‘కొండా’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. యంగ్ హీరో అదిత్ అరుణ్, వర్మ ‘భైరవగీత’ లో నటించిన ఐరా మోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ పేరిట వర్మ వదిలిన ఐదు పోస్టర్లు ఆకట్టుకోవడంతో పాటు ఈ క్రేజీ బయోపిక్ మీద సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అలాగే ఈ ‘కొండా’ బయోపిక్ తెలంగాణ ‘రక్తచరిత్ర’ అవుతుందంటూ వర్మ ట్వీట్ చేశాడు.