RAPO19: రామ్ – లింగుస్వామి.. యాక్షన్ స్టార్ట్!

ఇస్మార్ట్ శంకర్ తో ఉస్తాద్ గా మారిపోయిన ఎనర్జీటిక్ హీరో రామ్ ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. సెకండ్ వేవ్ లాక్‌డౌన్‌ ముందు ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసి పూజా కార్యక్రమాలు కూడా పూర్తిచేయగా సెకండ్ వేవ్ తో షూట్ వాయిదా పడింది.

RAPO19: రామ్ – లింగుస్వామి.. యాక్షన్ స్టార్ట్!

Rapo19

RAPO19: ఇస్మార్ట్ శంకర్ తో ఉస్తాద్ గా మారిపోయిన ఎనర్జీటిక్ హీరో రామ్ ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. సెకండ్ వేవ్ లాక్‌డౌన్‌ ముందు ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసి పూజా కార్యక్రమాలు కూడా పూర్తిచేయగా సెకండ్ వేవ్ తో షూట్ వాయిదా పడింది. కాగా.. ఇప్పుడు సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో అన్ని సినిమాలు మళ్ళీ పట్టాలెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే రామ్ – లింగుస్వామి కూడా యాక్షన్ మొదలుపెట్టనున్నారు.

జులై 12 నుండి షూటింగ్ మొదలుపెట్టనున్నట్లు ఈ సినిమా యూనిట్ ప్రకటించేసింది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమా గురించి ప్రేక్షకులలో భారీ అంచనాలే నెలకొన్నాయి. లింగుస్వామి స్టైలిష్ మాస్ సినిమాలను తెరకెక్కించడంలో దిట్ట కాగా.. రామ్ నుండి కూడా అభిమానులు అలాంటి సినిమాలనే ఇష్టపడుతున్నారు. దీంతో ఈ కాంబినేషన్ ఇప్పుడు ఇండస్ట్రీని ఆకర్షిస్తుంది.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్న ఈ సినిమా హీరో రామ్ కెరీర్‌లో 19వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ ఎనర్జీని మరో స్థాయిలో ప్రెజెంట్ చేయాలని ఓ మాస్ కథను సిద్ధం చేసిన లింగుస్వామి.. రామ్‌ని డిఫరెంట్ షేడ్‌లో చూపించనున్నట్లు తెలుస్తుంది.