The Warrior: సెన్సార్ ముగించుకున్న ది వారియర్

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది వారియర్’ అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను తమిళ.....

The Warrior: సెన్సార్ ముగించుకున్న ది వారియర్

The Warrior: యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది వారియర్’ అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను తమిళ డైరెకర్ట్ లింగుస్వామి తెరకెక్కిస్తుండటంతో ‘ది వారియర్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను జనంలోకి తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్‌ను భారీ ఎత్తున నిర్వహిస్తోంది. కాగా తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది.

The Warrior : ది వారియర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

ది వారియర్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ మలిచిన తీరు బాగుందని సెన్సార్ బోర్డు సభ్యులు చిత్ర యూనిట్‌ను అభినందించినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసి, ఈ సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. రామ్ పోతినేని పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రేక్షకులను ఈ సినిమాతో మెస్మరైజ్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.

The Warrior: నైజాం రారాజు ఆయనే అంటోన్న ది వారియర్!

ఇక అందాల భామ కృతి శెట్టితో రామ్ రొమాంటిక్ ట్రాక్ ఈ సినిమాకు మరో మేజర్ హైలైట్ కానున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాలో ఓ సగటు ప్రేక్షకుడు కోరుకునే అంశాలన్నీ పుష్కలంగా ఉన్నాయని, ఈ సినిమా పైసా వసూల్ సినిమా అని చిత్ర యూనిట్ చెబుతోంది. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ది వారియర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.