Ram Pothineni : పూరి గారితో మళ్ళీ సినిమా చేస్తా.. ఇస్మార్ట్ శంకర్‌కి మించి..

పూరి గురించి రామ్ మాట్లాడుతూ.. ''పూరి గారి ట్యాలెంట్ గురించి మనకి తెలుసు. దానిపై నాకు నమ్మకం ఉంది. ఆ సమయంలో నేను ఆయనతోనే సినిమా చేయాలనే మూడ్‌లో ఉన్నా. దాంతో.......................

Ram Pothineni : పూరి గారితో మళ్ళీ సినిమా చేస్తా.. ఇస్మార్ట్ శంకర్‌కి మించి..

Rapo

Poori Jagannadh :  ఇస్మార్ట్ శంకర్ సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చి ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు రామ్ పోతినేని. చాక్‌లెట్ బాయ్ నుంచి పూర్తిగా మాస్ లోకి మారిపోతున్నాడు. త్వరలో ది వారియర్ అనే సినిమాతో మొదటి సారి పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. పక్కా మాస్ యాక్షన్ సినిమాగా ది వారియర్ జులై 14న రాబోతుంది. కృతిశెట్టి హీరోయిన్ గా నటించగా తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్. తాజాగా రామ్, కృతి కలిసి బిత్తిరి సత్తితో ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో సినిమా గురించి, వాళ్ళ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేసారు రామ్, కృతి. ఈ ఇంటర్వ్యూలో ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమా తర్వాత పూరి ఎక్కడ కనిపించినా మిమ్మల్నే పొగుడుతున్నారు. మీ వల్లే ఆ సినిమా తెరకెక్కిందని అన్నారు అని సత్తి పూరి జగన్నాధ్ ప్రస్తావన తీసుకొచ్చాడు.

Faria Abdullah : ఫరియా అబ్దుల్లా అద్భుతమైన నాటక ప్రదర్శన

పూరి గురించి రామ్ మాట్లాడుతూ.. ”పూరి గారి ట్యాలెంట్ గురించి మనకి తెలుసు. దానిపై నాకు నమ్మకం ఉంది. ఆ సమయంలో నేను ఆయనతోనే సినిమా చేయాలనే మూడ్‌లో ఉన్నా. దాంతో ఆయనేంటి? హిట్స్ లో లేడు కదా? అనేవి ఏమి ఆలోచించలేదు. కెరీర్‌లో ఎత్తుపల్లాలు ఉండటం సహజమే. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్‌ డైరెక్టర్స్‌లో ఆయన కూడా ఒకరు. అన్ని కుదిరితే మళ్ళీ పూరి గారితో సినిమా చేస్తాను. ఈ సారి ఇస్మార్ట్ కి మించి ఉండేలా ప్లాన్ చేస్తాను” అని తెలిపారు.