Rashmika Mandanna : పదేళ్ల తర్వాత వాటినే క్లాసిక్స్ అంటారు.. ఫ్లాప్ సినిమాలని సమర్ధించుకున్న రష్మిక..

తాజగా ఓ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక తన ఫ్లాప్ సినిమాలపై మాట్లాడింది. యాంకర్ మీరు నటించిన డియర్ కామ్రేడ్, గుడ్ బై.. లాంటి కొన్ని సినిమాలు అంతగా కమర్షియల్ సక్సెస్ అవ్వలేదు, బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యాయి అని అనడంతో రష్మిక................

Rashmika Mandanna : పదేళ్ల తర్వాత వాటినే క్లాసిక్స్ అంటారు.. ఫ్లాప్ సినిమాలని సమర్ధించుకున్న రష్మిక..

Rashmika Mandanna comments on her flop movies

Rashmika Mandanna :  రష్మిక మందన్న ప్రస్తుతం ఓ పక్క తెలుగు, తమిళ్ లో సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లో కూడా పాతుకుపోవడానికి బాగా ట్రై చేస్తూ వరుస సినిమాలు చేస్తుంది. ఇటీవలే సంక్రాంతికి విజయ్ సరసన వరిసు సినిమాతో వచ్చి ప్రేక్షకులని మెప్పించింది. జనవరి 20న బాలీవుడ్ లో సిద్దార్థ్ మల్హోత్రా సరసన మిషన్ మజ్ను సినిమాతో రాబోతుంది ఈ నేషనల్ క్రష్.

సినిమా ఆర్టిస్టులకి, ఎంతటి స్టార్స్ కి అయినా హిట్స్, ఫ్లాప్స్ మాములే. కానీ వాటిపై ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతారు. రష్మిక కెరీర్ లో కూడా కొన్ని ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి. దారుణంగా ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇటీవల బాలీవుడ్ లో ఎంతో ఆశగా అమితాబ్ బచ్చన్ సినిమా ‘గుడ్ బై’తో ఎంట్రీ ఇచ్చినా ఈ సినిమా కూడా ఫ్లాప్ అయి రష్మిక బాలీవుడ్ ఎంట్రీని నిరాశపరిచింది.

Rashmika : నన్ను ట్రోల్ చేస్తే ఓకే.. నా ఫ్యామిలీని ట్రోల్ చేస్తే మాత్రం ఊరుకోను..

తాజగా ఓ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక తన ఫ్లాప్ సినిమాలపై మాట్లాడింది. యాంకర్ మీరు నటించిన డియర్ కామ్రేడ్, గుడ్ బై.. లాంటి కొన్ని సినిమాలు అంతగా కమర్షియల్ సక్సెస్ అవ్వలేదు, బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యాయి అని అనడంతో రష్మిక.. కొన్ని సినిమాలు కొంతమంది ఆడియన్స్ కే నచ్చుతాయి. అన్ని సినిమాలు అందరికి నచ్చవు. గుడ్ బై సినిమా చేసినప్పుడే అందరికి తెలుసు దీనికి కలెక్షన్స్ రావు అని. ఇప్పుడు ఇలాంటి సినిమాలని జనాలు చూడకపోవచ్చు కానీ ఒక పదేళ్ల తర్వాత అలాంటి సినిమా వస్తే బాగుండు అని మాట్లాడుకుంటారు అని తెలిపింది. దీంతో ఫ్లాప్ సినిమాలని కూడా ఇలా సమర్ధించుకోవడంతో రష్మికని ఈ విషయంలో మరోసారి నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.