Rashmika Mandanna : రష్మిక ఆ హీరోలకు నో చెప్పిందా??

రష్మిక ప్రస్తుతం సౌత్ లో బిజీగా ఉంటూనే బాలీవుడ్ లో కూడా వరసగా సినిమాలు ప్లాన్ చేసుకుంది. ఎంట్రీ ఇవ్వడమే అమితాబ్ సినిమాతో గ్రాండ్ లాంచ్ అయ్యింది. ఆ తర్వాత సిద్దార్ద్ మల్హోత్రా తో మిషన్ మజ్ను చేసింది.

Rashmika Mandanna : రష్మిక ఆ హీరోలకు నో చెప్పిందా??

Rashmika Mandanna say no to these heros and movies

Rashmika Mandanna :  ఏ హీరోయిన్ అయినా స్టార్ హీరోలతో సినిమా అంటే ఆ చాన్స్ వదులుకుంటుందా..? ఇప్పుడిప్పుడే స్టార్ హీరోయిన్ గా సౌత్(South) టూ నార్త్(North) బిజీ అవుతున్న సౌత్ భామ రష్మిక(Rashmika) తన కెరీర్ లో చాలా మంది స్టార్ హీరోలకి నో చెప్పిందట. సౌత్ టూ నార్త్ వరసగా సినిమాలు చేస్తున్న రష్మిక మందన్న ఇటు సౌత్ లో అటు నార్త్ లో కూడా చాలా మంది టాప్ హీరోలతో సినిమాలు చెయ్యనని చెప్పిందట.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో ఆఫరొచ్చినా కూడా రష్మిక నో చెప్పింది. సౌత్ టాప్ డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్లో 200కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న RC15 గేమ్ ఛేంజర్ సినిమాకి ముందు హీరోయిన్ గా రష్మిక మందన్నని అడిగారట కానీ రష్మిక ఏవో కారణాలతో నో చెప్పడంతో ఆ రోల్ కియారా అద్వానీకి వెళ్ళింది.

ఇటీవల తమిళ్ స్టార్ హీరో విజయ్ తో కలిసి వారసుడు సినిమాలో మెప్పించింది రష్మిక. కానీ అంతకుముందే రష్మికకు విజయ్ సరసన ఛాన్స్ వస్తే వదులుకుందట. లోకేష్ కనగరాజ్, విజయ్ కాంబినేషన్లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సినిమా మాస్టర్ మూవీలో ఫస్ట్ హీరోయిన్ గా రష్మికనే అనుకున్నారు. కానీ రష్మికకు డేట్స్ కుదరకపోవడంతో ఈ సినిమాకు కూడా నో చెప్పింది. కానీ అదృష్టం బాగుండి ఆ తర్వాత వారసుడు సినిమాలో ఛాన్స్ వచ్చింది రష్మికకు.

రష్మిక ప్రస్తుతం సౌత్ లో బిజీగా ఉంటూనే బాలీవుడ్ లో కూడా వరసగా సినిమాలు ప్లాన్ చేసుకుంది. ఎంట్రీ ఇవ్వడమే అమితాబ్ సినిమాతో గ్రాండ్ లాంచ్ అయ్యింది. ఆ తర్వాత సిద్దార్ద్ మల్హోత్రా తో మిషన్ మజ్ను చేసింది. ఈ సినిమాల కంటే ముందే రష్మికకి హిందీ జెర్సీ ఆఫరొచ్చింది. షాహిద్ కపూర్ హీరోగా బాలీవుడ్ లో తెరకెక్కిన జెర్సీలో ఆఫరొచ్చినా ఆ క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ ఫుల్ గా లేదని షాహిద్ కి నో చెప్పిందట రష్మిక.

Priya Bhavani Shankar : రుద్రుడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చీరలో మెరిపించిన ప్రియా భవాని శంకర్..

ఇప్పుడు వరుసగా బాలీవుడ్ లో రష్మిక చాలా ఆఫర్లు అందుకుంటోంది. నేషనల్ క్రష్ గా నార్త్ ఆడియన్స్ కి బాగా రీచ్ అయిన రష్మిక ఆచితూచి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటుంది. బాలీవుడ్ లో యువ హీరో కార్తిక్ ఆర్యన్ తో తన మొదటి సినిమా కిరాక్ పార్టీ రీమేక్ లో ఛాన్స్ వచ్చినా నో చెప్పిందట రష్మిక. సేమ్ స్టోరీ మళ్ళీ చేయడం ఇష్టం లేదట.

Urvashi Rautela : ఏజెంట్ లో ఐటెం సాంగ్ కోసం మెగాస్టార్ భామ.. అటు రామ్ – బోయపాటి సినిమాలో కూడా..

బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ లేటెస్ట్ గా లీడింగ్ లేడీస్ సోనాక్షిసిన్హా, అదితిరావ్ హైదరి, మనీషా కోయిరాలా.. ఇలా పలువురు స్టార్స్ తో హీరా మండీ అనే సిరీస్ చేస్తున్నారు. ఈ సిరీస్ లో ఒక రోల్ కి రష్మికని అడిగినా నో చెప్పింది అట. కొన్ని సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ అవ్వక నో చెప్తే మరి ఇంకొన్ని సినిమాలకు ఎందుకు నో చెప్పిందో ఆమెకే తెలియాలి. ఈ విషయం తెలిసి రష్మిక ఇంతమంది హీరోలకు, ఇన్ని సినిమాలకు నో చెప్పిందా, ఎందుకో అని ఆలోచిస్తున్నారు అభిమానులు, నెటిజన్లు. ఇన్ని సినిమాలకు నో చెప్పినా ఆఫర్స్ కి మాత్రం ఢోకా లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది రష్మిక.