Rashmika Mandanna: వరసపెట్టి ఆస్తులు కొనేస్తున్న భామ.. ఎక్కడో తెలుసా?

సౌత్ లో అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న రష్మిక.. బాలీవుడ్ లో కూడా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇలా అటు సౌత్.. ఇటు నార్త్ లో సినిమాలు చేస్తూ..

Rashmika Mandanna: వరసపెట్టి ఆస్తులు కొనేస్తున్న భామ.. ఎక్కడో తెలుసా?

Rashmika Mandanna

Rashmika Mandanna: సౌత్ లో అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న రష్మిక.. బాలీవుడ్ లో కూడా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇలా అటు సౌత్.. ఇటు నార్త్ లో సినిమాలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్న ఈ కన్నడకస్తూరి డబ్బు మొత్తం తీసుకెళ్లి ఎక్కడ పెడుతోందో తెలుసా.. ఆస్తులు కోనేస్తుందట.

Big Boss 5: హమీదా కావాలా?.. టైటిల్ కావాలా?.. శ్రీరామ్‌కు నాగ్ సూటి ప్రశ్న!

తెలుగు, తమిళ్, కన్నడలో వరుసగా సినిమాలు కమిట్ అయ్యింది రష్మిక. యంగ్ హీరోల దగ్గరనుంచి స్టార్ హీరోల వరకూ వరుస పెట్టి సినిమాలు చేస్తున్న రష్మిక.. ఇటు తెలుగుతో పాటు బాలీవుడ్ లో అప్పుడే రెండు సినిమాలు అవ్వగొట్టింది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ గా డబ్బులు సంపాదిస్తున్న రష్మిక.. వరుసపెట్టి ఇళ్లు కొనేస్తోంది.

Most Eligible Bachelor: హిట్ కొడతానని అఖిల్ శపథం.. అంత కాన్ఫిడెంట్ ఏంటో!

నిన్నకాక మొన్న బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ మిషన్ మజ్నుతో పాటు గుడ్ బై సినిమాలు చేస్తోంది. రెండు చేతులా సంపాదిస్తున్న రష్మిక ఇండియా మొత్తం జెండా పాతేస్తోంది. మొన్నీమధ్యనే ముంబైలో ఇల్లు కొన్న రష్మక లేటెస్ట్ గా గోవాలో కూడా ఇల్లు కొనేసింది. దీనికి సంబందించి స్విమ్మింగ్ ఫూల్ ఫోటోలతో అసూయ పడుతున్నారా అంటూ టీజింగ్ గా పోస్ట్ పెట్టింది.

Hamsa Nandini: సిగ్గులు ఒలుకుతున్న హంసా.. కుర్రాళ్ళకెందుకీ హింసా!

జూన్ లో ముంబైలో ఇల్లుకొన్న రష్మిక.. మూడు నెలలు తిరక్కుండానే గోవాలో మరో ఇల్లు కొనేసి మనీ మ్యానేజింగ్ బాగానే చేస్తోందంటున్నారు ఫ్యాన్స్. బాలీవుడ్ షూటింగ్స్ కి ఫ్రీక్వెంట్ గా వెళ్లాల్సిరావడంతో అక్కడ హోటల్స్ లో ఉండడం ఇష్టం లేక సొంతగా ఇల్లు కొనేసుకుంది. ఇక లీజర్ టైమ్ లో ఎంజాయ్ చెయ్యడానికి గోవాలో కూడా ఇల్లు కొనేసింది. ఇలా అటు ముంబై, గోవా మధ్యలో బెంగుళూరు.. ఎక్కడ ఉంటే ఇల్లు కొనేసుకుంటూ ఇండియా మొత్తం ఇన్వెస్ట్ చేస్తోంది.