Rashmika Mandanna : ‘పుష్ప’లో ‘సామి సామి..’ సాంగ్ కోసం రష్మిక ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేసిందో తెలుసా??

ఇందులో 'సామి సామి...' మాస్ సాంగ్ బాగా హిట్ అయింది. ఈ మాస్ సాంగ్ కి అల్లు అర్జున్ గ్రేస్, రష్మిక అందంతో డ్యాన్స్ జతచేసి అద్భుతంగా వచ్చిందని సమాచారం. రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్.....

Rashmika Mandanna : ‘పుష్ప’లో ‘సామి సామి..’ సాంగ్ కోసం రష్మిక ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేసిందో తెలుసా??

Rashmika

Rashmika Mandanna :  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, రష్మిక మందన్న హీరో హీరోయిన్స్ గా సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా పుష్ప. ఇప్పటికే టీజర్, సాంగ్స్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. డిసెంబర్ 6వ తేదీన ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి పార్ట్ ని డిసెంబర్ 17న పాన్ ఇండియా సినిమాగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా సాంగ్స్ బాగా వైరల్ అయ్యాయి. యూట్యూబ్ లో ట్రెండ్ అయ్యాయి.

Samantha : జీవితంలో చాలా నేర్చుకున్నా.. పట్టుకోవడం కంటే వదిలేయడం బెటర్ అంటున్న సమంత

ఇందులో ‘సామి సామి…’ మాస్ సాంగ్ బాగా హిట్ అయింది. ఈ మాస్ సాంగ్ కి అల్లు అర్జున్ గ్రేస్, రష్మిక అందంతో డ్యాన్స్ జతచేసి అద్భుతంగా వచ్చిందని సమాచారం. రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్ లో రష్మిక స్టెప్పులు కొన్ని చూపించారు. ఆ స్టెప్పులు కూడా బాగా వైరల్ అయ్యాయి. ఎక్కడ చూసినా ఇప్పుడు ‘పుష్ప’ పాటలే వినిపిస్తున్నాయి. అయితే ‘సామి సామి..’ సాంగ్ లో డ్యాన్స్ కోసం రష్మిక బాగా కష్టపడిందట.

Puneeth Rajkumar Family : పునీత్ రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించిన పెద్దిరెడ్డి

ఇండస్ట్రీలో బెస్ట్ డాన్సర్స్ లో అల్లు అర్జున్ ఒకరు. డాన్స్ చేయ‌డంలో ఆయనది సపరేట్ స్టైల్. మరి ఆ స్టైల్ ని మ్యాచ్ చేయాలి అంటే ఎక్కువ కష్టపడాలి కదా. అందుకే రష్మిక మంద‌న్న ఏకంగా 18 గంట‌లు పాటు రిహార్స‌ల్ చేసింద‌ట‌. ఈ ఒక్క పాటకే ఇంత సేపు రిహార్సిల్ చేసి షూట్ లో బాగా చేసిందని సినిమా బృందంలో అనుకుంటున్నారు. పర్ఫెక్ట్ గా చేయడం కోసం, సినిమా కోసం రష్మిక ఎంత కష్టపడుతుందో మరోసారి ప్రూవ్ చేసుకుందని అంటున్నారు నెటిజన్లు.