Allu Arjun Rashmika : ‘ఐకాన్‌ స్టార్‌’కి స్పెషల్ గిఫ్ట్ పంపించిన రష్మిక

తాజాగా రష్మిక అల్లు అర్జున్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. త్వరలో 'పుష్ప' మూవీ విడుదల కాబోతోన్న నేపథ్యంలో బన్నీకి స్పెషల్‌ గిఫ్ట్‌ పంపించింది. రష్మిక ఓ స్పెషల్ గిఫ్ట్ ని.....

Allu Arjun Rashmika : ‘ఐకాన్‌ స్టార్‌’కి స్పెషల్ గిఫ్ట్ పంపించిన రష్మిక

Rashmika

Allu Arjun Rashmika :  ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా హీరో హీరోయిన్స్ గా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా రాబోతుంది. అల్లు అర్జున్ మొదటి పాన్‌ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి పార్ట్ ఈ నెల 17వ తేదీన విడుదల అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, మూడు సాంగ్స్ బాగా వైరల్ అయ్యాయి. ఇవి సినిమాపై మరిన్ని అంచనాలు పెంచాయి. ఈ నెల 6వ తేదీన ‘పుష్ప’ ట్రైలర్ రిలీజ్ అవ్వబోతుంది. అభిమానులు దీని కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Bigg Boss Manas : మానస్ కోసం తరలి వస్తున్న తారలు.. మరో వైపు బిగ్ బాస్ మాజీ విన్నర్ కూడా..

తాజాగా రష్మిక అల్లు అర్జున్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. త్వరలో ‘పుష్ప’ మూవీ విడుదల కాబోతోన్న నేపథ్యంలో బన్నీకి స్పెషల్‌ గిఫ్ట్‌ పంపించింది. రష్మిక ఓ స్పెషల్ గిఫ్ట్ ని అల్లు అర్జున్ కి పంపించడంతో అది ఓపెన్ చేసి తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు బన్నీ. ‘మూవీ త్వరలో విడుదల కాబోతోంది కదా సార్‌.. స్పెషల్‌గా ఏదైన పంపించాలనిపించింది. అందుకే ఈ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ మీ కోసం’ అంటూ చేతితో రాసిన నోట్‌తో పాటు ఓ ప్రముఖ రెస్టారెంట్ కి సంబంధించిన కొన్ని ఫుడ్ ఐటమ్స్ ని బాక్స్ లో పెట్టి పంపించింది. దీనిని అల్లు అర్జున్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేస్తూ రష్మికకు ధన్యవాదాలు తెలిపాడు.