Khiladi: హిందీలో ఖిలాడీ.. బాలీవుడ్‌లో మాస్ మహరాజ్ మూవీ రిలీజ్!

కోవిడ్ మూడో వేవ్ దెబ్బకు వాయిదా పడిన సినిమాలన్నీ వరుసగా విడుదకు క్యూ కడుతున్నాయి.

Khiladi: హిందీలో ఖిలాడీ.. బాలీవుడ్‌లో మాస్ మహరాజ్ మూవీ రిలీజ్!

Khiladi

Khiladi: కోవిడ్ మూడో వేవ్ దెబ్బకు వాయిదా పడిన సినిమాలన్నీ వరుసగా విడుదకు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే భారీ సినిమాలు మొత్తం విడుదల తేదీలను ప్రకటించగా.. మాస్ మహరాజ్ ర‌వితేజ హీరోగా నటించిన ఖిలాడి సినిమా కూడా విడుదలకు సిద్ధం అవుతోంది. ర‌మేశ్ వ‌ర్మ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాలో డింపుల్ హ‌య‌తి, మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

ఈ సినిమాను ఫిబ్ర‌వరి 11న గ్రాండ్‌గా థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుండగా.. ఈ సినిమాను తెలుగులోనే కాదు హిందీలో కూడా అదేరోజు విడుదల చేయబోతున్నారు. కోవిడ్ కారణంగా బాలీవుడ్ సినిమాలు చాలావరకు విడుదల వాయిదా పడగా.. ‘ఖిలాడీ’ నిర్మాతలు హిందీ బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు.

ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశం కావడంతో నమ్మకంగా సినిమాని అక్కడ కూడా ఆదరిస్తారని చిత్రయూనిట్ భావిస్తోంది. బాలీవుడ్‌లో ఈ సినిమాని పెన్ స్టూడియోస్ విడుదల చేస్తోంది. రమేష్ వర్మ దర్శకత్వం వహించిన ‘ఖిలాడి’ సినిమాని ఏ స్టూడియోస్ పతాకంపై సత్యనారాయణ కోనేరు నిర్మించారు. ఈ చిత్రంలో అర్జున్ సార్జా, ఉన్ని ముకుంద‌న్ ముఖ్యమైన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.