Dhamaka Review : మాస్ హిలేరియస్.. ధమాకా రివ్యూ..

రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ధమాకా. ఈ సినిమా డిసెంబర్ 23న రిలీజ్ అయింది. రవితేజ గత రెండు సినిమాలు నిరాశపరచడంతో ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకొని రవితేజ మొదటిసారి ముందుండి ప్రమోషన్స్ చేశాడు. చిత్ర యూనిట్.........

Dhamaka Review : మాస్ హిలేరియస్.. ధమాకా రివ్యూ..

Raviteja Dhamaka movie Review

Dhamaka Review :  రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ధమాకా. ఈ సినిమా డిసెంబర్ 23న రిలీజ్ అయింది. రవితేజ గత రెండు సినిమాలు నిరాశపరచడంతో ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకొని రవితేజ మొదటిసారి ముందుండి ప్రమోషన్స్ చేశాడు. చిత్ర యూనిట్ భావించినట్టే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా చూసిన వాళ్లంతా హిలేరియస్ గా ఉందంటున్నారు.

కథ విషయానికొస్తే ఇద్దరు రవితేజలు ఒకరు మిడిల్ క్లాస్, ఒకరు రిచ్. ఎవరి లైఫ్స్ వాళ్ళవి అన్నట్టు చూపిస్తారు. మధ్యలో శ్రీలీల ఇద్దరితో లవ్ లో పడి ట్రావెల్ అయి ఒకరికి ఓకే చెపుదాం అనుకుంటుంది. అలాగే రిచ్ రవితేజకి ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఇంట్రవెల్ కి ముందు ఇద్దరూ ఒకటే అని రివీల్ చేస్తారు. విలన్ రిచ్ రవితేజని చంపాడు అనుకుంటాడు. ఆ ప్లేస్ లోకి మిడిల్ క్లాస్ రవితేజ వెళ్తాడు. ఆ తర్వాత నుంచి కథ ఎలా సాగింది? హీరోయిన్ కి ఇద్దరూ ఒకటే అని ఎలా తెలిసింది? తెలిసాక ఏం చేసింది? విలన్స్ కి ఎలా తెలిసింది? విలన్ ఎత్తుగడలని రవితేజ ఎలా తిప్పికొట్టాడు, తన ఫ్యామిలీలని ఎలా కాపాడుకున్నాడు? అసలు ఇద్దరిలా ఎందుకు ఉంటున్నాడు అనేది థియేటర్లో చూడాల్సిందే.

ఒకరు ఇద్దరిలా నటించడం అనేది గతంలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ కొన్ని సినిమాల్లో నటించి మెప్పించారు. ఈ సినిమాని వాటిలాగే కామెడీగా రాశారు. మొదటి హాఫ్ అంతా కామెడీ హిలేరియస్ గా ఉంటుంది. ఇంటర్వెల్ ముందు నుంచి యాక్షన్, ట్విస్టులు, సీరియస్ డ్రామా మధ్యలో కామెడీ ఉంటుంది. సాంగ్స్ అదరగొట్టేసారు. యూట్యూబ్ లో ట్రెండ్ అయిన ఓ పాటని స్పెషల్ సాంగ్ లాగా వాడారు. మొత్తానికి అభిమానులకి అయితే ఫుల్ మీల్స్ సినిమా లాంటిది. సాధారణ ప్రేక్షకులకి అక్కడక్కడా బోర్ కొట్టినా సినిమా మాత్రం నచ్చుతుంది. ఇక కలెక్షన్స్ కూడా బాగుండటంతో మొత్తానికి రవితేజ మళ్ళీ హిట్ కొట్టాడు.

Chiranjeevi : నాకేంటి, నా కుటుంబానికేంటి అని ఆలోచించా ఇన్నాళ్లు.. చిరు సంచలన కామెంట్స్!

పర్ఫార్మెన్స్ పరంగా రవితేజ అదరగొట్టేశాడు. శ్రీలీల సీన్స్ చాలా క్యూట్ గా బాగుంటాయి. డ్యాన్స్ శ్రీలీల అదరగొట్టేసింది. మాస్ బీట్స్ లో కూడా సూపర్ గా చేసింది. రావు రమేష్, పక్కన హైపర్ ఆది కామెడీ బాగుంటుంది. విలన్ గా సీనియర్ నటుడు జయరాం బాగా చేశారు. మ్యూజిక్ డైరెక్టర్, యష్ మాస్టర్ ఓ సాంగ్ లో అలా కనిపించి మెరిపించారు. మొత్తానికి ధమాకా ఒక మాస్ హిలేరియస్ ఎంటర్టైనర్ అనిపించుకుంటుంది.