Raviteja : క్లాస్, మాస్.. ధర్మం కోసం నిలబడే రామారావు.. ‘రామారావు ఆన్ డ్యూటీ’ ట్రైలర్ మాస్ ర్యాంపేజ్..

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌ హోటల్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కార్యక్రమం ఏర్పాటు చేసి రామారావు ఆన్ డ్యూటీ ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ ట్రైలర్...............

Raviteja : క్లాస్, మాస్.. ధర్మం కోసం నిలబడే రామారావు.. ‘రామారావు ఆన్ డ్యూటీ’ ట్రైలర్ మాస్ ర్యాంపేజ్..

Raviteja

Ramarao On Duty :  బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంతో కష్టపడి మాస్‌ మహారాజాగా స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు రవితేజ. హిట్లు, ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల ‘క్రాక్‌’ సినిమాతో భారీ కంబ్యాక్ ఇచ్చినా ఆ తర్వాత వచ్చిన ‘ఖిలాడీ’ ఆశించినంత విజయం సాధించలేదు. ప్రస్తుతం రవితేజ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. తాజాగా రవితేజ నెక్స్ట్ సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. అనేక వాయిదాల అనంతరం ఈ సినిమా జులై 29న విడుదల కాబోతుంది. ఈ సినిమాని కొత్త దర్శకుడు శరత్‌ మండవ తెరకెక్కించగా SLV సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ తో పాటు రవితేజ కూడా కలిపి నిర్మిస్తున్నారు. ఇందులో దివ్యంశ కౌశిక్, రజిష హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వేణు తొట్టెంపూడి ఈ సినిమాతో మళ్ళీ రీఎంట్రీ ఇస్తుండటం విశేషం.

Vaishnavi Chaitanya : బిగ్‌బాస్ కి అస్సలు వెళ్ళను.. షన్ను దొరకనంతగా బిజీ అయిపోయాడు..

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌ హోటల్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కార్యక్రమం ఏర్పాటు చేసి రామారావు ఆన్ డ్యూటీ ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ ఫుల్ మాస్ మషాలాగా సాగింది. ఓ గవర్నమెంట్ ఆఫీసర్ అన్యాయానికి ఎదురు తిరిగితే ఎలా ఉంటుంది అనే కథతో పాటు, కొంతమంది కనిపించకుండా పోయిన వారి కోసం వెతికే పాత్రగా కూడా రవితేజ ఎప్పటిలాగానే తన మాస్ యాంగిల్ ని చూపించాడు. చివర్లో ఇప్పుడే వేట మొదలైంది అంటూ సినిమాపై అంచనాలు పెంచేసాడు రవితేజ. ట్రైలర్ చూసిన తర్వాత మాస్ మహారాజ్ నుంచి మరో మాస్ సినిమా రాబోతుందని అర్థమైపోయింది. సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.