Ravanasura : రావణాసుర ప్రీ రిలీజ్ బిజినెస్.. ధమాకా కంటే తక్కువే.. మాస్ మహారాజ హ్యాట్రిక్ కొడతాడా?

రవితేజ ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రావణాసుర సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు.

Ravanasura : రావణాసుర ప్రీ రిలీజ్ బిజినెస్.. ధమాకా కంటే తక్కువే.. మాస్ మహారాజ హ్యాట్రిక్ కొడతాడా?

Raviteja Ravanasura Movie Pre Release Business Details

Ravanasura :  మాస్ మహారాజ(Mass Maharaja) రవితేజ(Raviteja) నేడు రావణాసుర(Ravanasura) సినిమాతో రాబోతున్నాడు. అను ఇమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ, ఫరియా అబ్దుల్లా, దక్ష నగర్కర్, మేఘ ఆకాష్.. ఇలా అయిదుగురు హీరోయిన్స్, హీరో సుశాంత్(Sushanth) ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ నెగిటివ్ షేడ్స్ లో కనిపించనున్నారు. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. చిత్రయూనిట్ కూడా రావణాసుర సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది. ప్రమోషన్స్ గ్రాండ్ గా చేశారు. సుధీరవర్మ(Sudheer Varma) దర్శకత్వంలో తెరకెక్కిన రావణాసుర సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.

రవితేజ ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రావణాసుర సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు. రవితేజ రెండు హిట్స్ కొట్టడంతో ఈ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ బాగా జరుగుతుంది అనుకున్నారు. కానీ ధమాకా కంటే తక్కువే జరిగింది. ధమాకా సినిమా 28 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

రావణాసుర ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు…

నైజాం – 7 కోట్లు

ఆంధ్ర – 10 కోట్లు

సీడెడ్ – 3 కోట్లు

రెస్టాఫ్ ఇండియా & ఓవర్సీస్ – 2.20 కోట్లు

Ravanasura : రావణాసుర ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ..

రావణాసుర సినిమా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 22.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మరి ప్రస్తుతం ఫువుల్ ఫామ్ లో ఉన్న రవితేజ దీన్ని ఎన్ని రోజుల్లో బ్రేక్ ఈవెన్ చేస్తాడో చూడాలి. ఇక థియేటర్స్ వద్ద అభిమానులు సందడి చేస్తున్నారు. ఈ సినిమాతో హిట్ కొట్టి హ్యాట్రిక్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.