Ravanasura : సీతని తీసుకెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు రావణాసురుడ్ని దాటాలి.. రావణాసుర టీజర్ రిలీజ్.. రవితేజ నెగిటివ్ రోల్?

రావణాసుర టైటిల్ అనౌన్స్ చేసినప్పటినుంచి ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. తాజాగా రావణాసుర టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ లో................

Ravanasura : సీతని తీసుకెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు రావణాసురుడ్ని దాటాలి.. రావణాసుర టీజర్ రిలీజ్.. రవితేజ నెగిటివ్ రోల్?

Raviteja Ravanasura movie teaser released audience think raviteja doing negative role

Ravanasura :  రవితేజ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. గత సంవత్సరం ధమాకా సినిమా రిలీజయి 100 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టి సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఆ తర్వాత చిరంజీవితో కలిసి చేసిన వాల్తేరు వీరయ్య సినిమా కూడా 200 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. వరుస సినిమాలతో రవితేజ బిజీగా ఉన్నాడు. రవితేజ నెక్స్ట్ సినిమా రావణాసుర సుధీర్ వర్మ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మాణంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాకి రవితేజ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో అయిదుగురు హీరోయిన్స్ నటిస్తుండటం విశేషం. హీరో సుశాంత్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

రావణాసుర టైటిల్ అనౌన్స్ చేసినప్పటినుంచి ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. తాజాగా రావణాసుర టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ లో క్రైమ్ సీన్స్ ఎక్కువగా చూపించారు. పోలీసులు ఒక క్రిమినల్ కోసం వెతుకుతున్నట్టు చూపించారు. అలాగే రవితేజ, సుశాంత్ మధ్య ఫైట్ సన్నివేశాలు ఉండనున్నాయి. ఇక రవితేజ లాయర్ పాత్రతో పాటు నెగిటివ్ రోల్ లోను కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. సీతని తీసుకెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు రావణాసురుడ్ని దాటాలి అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ చూస్తే రవితేజ విలన్ ఏమో అన్న సందేహం కూడా కలుగుతుంది. టీజర్ చూసిన తర్వాత సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

NTR : ఎట్టకేలకు ఆస్కార్‌కు ఎన్టీఆర్ ప్రయాణం.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో జోష్..

టీజర్ చూశాక రావణాసుర సినిమా క్రైమ్, క్రైమ్ చేసిన వాళ్ళని పట్టుకోవడం అనే కాన్సెప్ట్ తో ఉందనిపిస్తుంది. టీజర్ లో రవితేజని నెగిటివ్ రోల్ లోనే చూపించారు. మరి నిజంగానే సినిమాలో రవితేజ నెగిటివ్ రోల్ అయితే రవితేజ పర్ఫార్మెన్స్ గురించి తెలిసిందే కచ్చితంగా ఇది కూడా హిట్ అవుతుంది. రావణాసుర సినిమా ఏప్రిల్ 7న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. అభిమానులు రవితేజ ఈ సినిమాతో కూడా హిట్ కొట్టి హ్యాట్రిక్ కొడతాడని భావిస్తున్నారు.