Ravanasura Trailer : ఈ భూమి మీద నన్ను ఆపగలిగేది ఎవడన్నా ఉన్నాడంటే అది నేనే.. రావణాసుర ట్రైలర్ రిలీజ్..

ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాతో కూడా రవితేజ ఇంకో హిట్ గ్యారెంటీగా కొడతాడు అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ఈ సినిమాలో రవితేజ లాయర్ గా.................

Ravanasura Trailer : ఈ భూమి మీద నన్ను ఆపగలిగేది ఎవడన్నా ఉన్నాడంటే అది నేనే.. రావణాసుర ట్రైలర్ రిలీజ్..

Raviteja Ravanasura trailer released

Ravanasura Trailer :  రవితేజ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టాడు. త్వరలో రావణాసుర సినిమాతో రాబోతున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మాన్యుయేల్, మేఘ ఆకాష్, దక్ష నాగర్కర్, పూజిత పొన్నాడ.. ఏకంగా అయిదుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు. సుశాంత్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే సాంగ్స్, టీజర్స్ తో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా రావణాసుర సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది.

సినిమా ట్రైలర్ అదిరిపోయింది. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాతో కూడా రవితేజ ఇంకో హిట్ గ్యారెంటీగా కొడతాడు అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ఈ సినిమాలో రవితేజ లాయర్ గా కనిపించబోతున్నాడు. అలాగే ఇందులో రవితేజ నెగిటివ్ షేడ్స్ ఉన్న వ్యక్తిగా కూడా నటించబోతున్నట్టు తెలుస్తుంది. ఓ పక్క సాధారణ లాయర్ గా మాస్ మహారాజా కామెడీతో పాటే మరోవైపు నెగిటివ్ షేడ్స్ కూడా చూపించబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో రవితేజే హీరోగా, విలన్ గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది.

Orange Movie: ఆరెంజ్ రీ-రిలీజ్.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో అరుదైన రికార్డు!

తాజాగా రిలీజయిన రావణాసుర ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ సినిమా ఏప్రిల్ 7న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో హిట్ కొట్టి హ్యాట్రిక్ సాధించాలి రవితేజ అని అందరూ కోరుకుంటున్నారు.