Raviteja : నా వెనక ఉండి రాజకీయాలు చేశారు : రవితేజ

అప్పుడప్పుడే ఎదుగుతున్న టైంలో తన వెనక ఉండి కొంతమంది రాజకీయాలు చేశారని అన్నాడు. దీని గురించి రవితేజ మాట్లాడుతూ.. పూరి జగన్ వల్ల తనకు 'ఇడియట్' లాంటి హిట్ సినిమా పడిందని, ఆ తర్వాత....

Raviteja : నా వెనక ఉండి రాజకీయాలు చేశారు : రవితేజ

Raviteja (1)

Raviteja :   ఆహా ఓటీటీలో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న బాలయ్య అన్ స్టాపబుల్ షోలో సెలబ్రిటీలతో బాలకృష్ణ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. షోలో బాలయ్య ఫుల్ ఎనర్జీ గా ఉంటారు. ఈ ఎనర్జీకి మరింత ఎనర్జీ తోడైతే ఆ ఎపిసోడ్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. మాస్ మహారాజ్ రవితేజ ఇటీవల బాలయ్యతో కలిసి ‘అన్ స్టాపబుల్ విత్ NBK’లో రచ్చ చేశారు. ఈ షోలో రవితేజ తన సినిమా విషయాలని, పర్సనల్ విషయాలని షేర్ చేసుకున్నారు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంతో కష్టపడి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి మాస్ మహారాజ్ గా ఎదిగాడు రవితేజ. ఈ ప్రయాణంలో అతను చూసిన కష్టాలు, సాధించిన సక్సెస్ లు బాలయ్యతో, ప్రేక్షకులతో షేర్ చేసుకున్నాడు.

 

ఈ క్రమంలోనే తను అప్పుడప్పుడే ఎదుగుతున్న టైంలో తన వెనక ఉండి కొంతమంది రాజకీయాలు చేశారని అన్నాడు. దీని గురించి రవితేజ మాట్లాడుతూ.. పూరి జగన్ వల్ల తనకు ‘ఇడియట్’ లాంటి హిట్ సినిమా పడిందని, ఆ తర్వాత వరుసగా ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి.. లాంటి వరుస హిట్లు పడ్డాయని చెప్పాడు. దీంతో కొత్త హీరో వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు అని వార్తలు రావడంతో కొంతమంది ఎవడ్రా దూసుకెళుతున్నాడు అని రవితేజని ఉద్దేశించి అన్నట్లు తెలిపాడు. కొంతమంది నా వెనక ఉండి నన్ను పడేయడానికి చాలానే రాజకీయాలు చేశారు అని రవితేజ తెలిపాడు.

Krishna : అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు.. సూపర్ స్టార్ కృష్ణకు ఘన సన్మానం..

దీంతో బాలకృష్ణ నీ వెనక ఉండి రాజకీయాలు చేసింది ఎవరు అని అడిగినా.. అవన్నీ ఇప్పుడు ఎందుకండీ. ఎప్పుడో జరిగిపోయాయి. నేను లైట్ తీసుకుంటాను అంటూ రవితేజ చెప్పాడు. అయితే రవితేజ ఎదిగే క్రమంలో అతడిపై రాజకీయాలు చేసింది ఎవరు? అతడ్ని పడేయాలనుకున్నది ఎవరు అంటూ ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఓ ప్రశ్న మిగిలిపోయింది. రవితేజ ఈ విషయంలో కొంచెం క్లారిటీ ఇస్తే బావుండేది అని అభిప్రాయపడుతున్నారు.