Anveshi Jain : ‘రామారావు’తో రచ్చ రంబోలా..

‘రామారావు ఆన్ డ్యూటీ’ లో పాపులర్ మోడల్ కమ్ యాక్ట్రెస్ అన్వేషి జైన్, మాస్ మహారాజా రవితేజతో కలిసి ఓ మాస్ మసాలా పాటకు స్టెప్పులెయ్యబోతుంది..

Anveshi Jain : ‘రామారావు’తో రచ్చ రంబోలా..

Anveshi Jain

Anveshi Jain: మాస్ మహారాజా రవితేజ ఫుల్ స్పీడ్ మీదున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో సందడి చేస్తున్నారు. ‘ఖిలాడి’, ‘ధమాకా’, ‘రామారావు ఆన్ డ్యూటీ’, ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలు రవితేజ చేతిలో ఉన్నాయి.

Super Machi : చిరు చిన్నల్లుడి రెండో సినిమా ట్రైలర్ చూశారా..

‘రామారావు ఆన్ డ్యూటీ’ విషయానికొస్తే.. ప్రస్తుతం జెట్ స్పీడ్‌తో షూటింగ్ జరుపుకుంటోంది. దివ్యాంశ కౌశిక్, రజీషా విజయన్ ఫీమేల్ లీడ్స్. శరత్ మండవ డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, ఆర్‌టి టీమ్ వర్క్స్ బ్యానర్ల మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

Sushanth : ‘రావణాసుర’ లో ‘రామ్’ గా..

ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. పాపులర్ మోడల్ కమ్ యాక్ట్రెస్ అన్వేషి జైన్ మాస్ మహారాజాతో కలిసి ఓ మాస్ మసాలా పాటకు స్టెప్పులెయ్యబోతుందట. ఈ స్పెషల్ సాంగ్ సినిమాకే హైలెట్ అవుతుందని చెప్తుంది టీమ్. ఒకప్పటి పాపులర్ హీరో వేణు తొట్టెంపూడి ‘రామారావు ఆన్ డ్యూటీ’ లో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు.

Raviteja 71 : ‘టైగర్ నాగేశ్వరరావు’ గా మాస్ మహారాజా!