Ramarao on Duty: రిలీజ్ డేట్ అనౌన్స్.. రామారావు వచ్చేది ఎప్పుడంటే?

మాస్ రాజా రవితేజ నటించిన రీసెంట్ మూవీ ‘ఖిలాడి’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలిచింది. తన సక్సెస్ ట్రాక్‌ కంటిన్యూ చేయాలని చూసిన రవితేజకు ఈ సినిమాతో..

Ramarao on Duty: రిలీజ్ డేట్ అనౌన్స్.. రామారావు వచ్చేది ఎప్పుడంటే?

Ramarao On Duty

Ramarao on Duty: మాస్ రాజా రవితేజ నటించిన రీసెంట్ మూవీ ‘ఖిలాడి’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలిచింది. తన సక్సెస్ ట్రాక్‌ కంటిన్యూ చేయాలని చూసిన రవితేజకు ఈ సినిమాతో ఎదురుదెబ్బ తగిలింది. ఇక ఇప్పుడు తన నెక్ట్స్ చిత్రాలపైనే ఫోకస్ పెట్టాడు ఈ మాస్ హీరో. కాగా ప్రస్తుతం ఆయన వరుసగా రెండు చిత్రాలను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. ధమాకా అనే సినిమాతో పాటు రామారావు ఆన్ డ్యూటీ అనే చిత్రాన్ని కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నాడు రవితేజ.

Ramarao on Duty: Ko2 దర్శకుడితో మాస్ మహరాజ్.. రామారావు ఆన్ డ్యూటీ!

అయితే రామారావు ఆన్ డ్యూటీ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీనికి కారణం ఈ సినిమా టైటిల్‌తో పాటు ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్. ఓ సిన్సియర్ ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో రవితేజ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకే హైలైట్‌గా నిలవనుంది. ఇక ఈ సినిమాతో మరోసారి తన సక్సెస్ ట్రాక్‌ను రవితేజ కంటిన్యూ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ భావిస్తోంది. కాగా శరత్ మండవ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ, రజీషాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Raviteja : ఆయుధంలా బతికే నా లాంటి వాడి ధైర్యం అణువణువునా.. రామారావు ఆన్ డ్యూటీ టీజర్ రిలీజ్..

ఈ సినిమా నుండి చిత్ర యూనిటో ఓ సడెన్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్లు తాజాగా ప్రకటించారు. చెప్పినట్లుగానే మార్చి 23న సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. జూన్ 17న రామారావు ఆన్ డ్యూటీని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టుగా క్రేజీ అనౌన్స్మెంట్ చేశారు. జూన్ నెలలో రిలీజ్ అంటే అప్పటికి భారీ క్రేజీ సినిమాల హడావుడి తగ్గిపోతుంది కనుక మాస్ రాజా తాపీగా బాక్సాపీస్ వద్ద దున్నేయాలని చూస్తున్నాడు. అయితే అప్పటికి మరెవరైనా పోటీకి వస్తారో లేక మాస్ రాజా సింగల్ గానే వస్తాడో చూడాలి.