Ram Charan : మళ్ళీ మొదలు కానున్న RC15.. ఏపీలో కొత్త షెడ్యూల్..

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో దిల్ రాజు RC 15 సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ముంబై, పుణె, పంజాబ్............

Ram Charan : మళ్ళీ మొదలు కానున్న RC15.. ఏపీలో కొత్త షెడ్యూల్..

Rc 15

RC 15 :  స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో దిల్ రాజు RC 15 సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ముంబై, పుణె, పంజాబ్, వైజాగ్, గోదావరి జిల్లాల్లో దోసకాయల పల్లి, రాజమండ్రి, కాకినాడ, కొవ్వూరు పరిసర ప్రాంతాల్లో మూడు షెడ్యూల్స్ షూటింగ్ జరిగింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అవుట్ డోర్ లొకేషన్స్ లో షూట్ చేస్తుండటంతో ఇటీవల షూటింగ్ కి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. ప్రస్తుతం కొద్దిగా గ్యాప్ ఇచ్చిన శంకర్ త్వరలో మూడో షెడ్యూల్ ని మొదలుపెట్టనున్నారు.

Ileana : కత్రినా సోదరుడితో ఇలియానా డేటింగ్??

జూలై 23 లేదా 24 నుంచి RC15 కొత్త షెడ్యూల్ మొదలు పెట్టనున్నారని సమాచారం. ఏపీలో ఎక్కువగా డైరెక్ట్ లొకేషన్స్ కి వెళ్లి షూటింగ్ చేస్తున్నారు చరణ్. ఈ సారి కూడా ఏపీలోని కర్నూల్, ఏలూరు ప్రాంతాల్లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. మొదట సంక్రాంతికి వద్దామనుకున్నా ఆ తర్వాత సమ్మర్ కి వాయిదా వేశారు దిల్ రాజు. శంకర్ చాలా గ్యాప్ తర్వాత భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ తో సినిమా ప్లాన్ చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. చెర్రీ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.