Realme 10 Pro Plus Sale : రియల్‌మి 10ప్రో ప్లస్ ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!

Realme 10 Pro Plus Sale : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు రియల్‌మి (Realme) నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ రెండు రోజుల క్రితమే లాంచ్ అయింది. భారత మార్కెట్లో Realme 10 Pro Series ఫోన్ అధికారికంగా తీసుకొచ్చింది.

Realme 10 Pro Plus Sale : రియల్‌మి 10ప్రో ప్లస్ ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!

Realme 10 Pro Plus first sale in India today _ Price, Specifications and more

Realme 10 Pro Plus Sale : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు రియల్‌మి (Realme) నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ రెండు రోజుల క్రితమే లాంచ్ అయింది. భారత మార్కెట్లో Realme 10 Pro Series ఫోన్ అధికారికంగా తీసుకొచ్చింది. రియల్‌మి 10ప్రో సిరీస్ కింద రియల్‌మి 10ప్రో (Realme 10Pro), రియల్‌మి 10ప్రో ప్లస్‌ (Realme 10pro Plus)తో సహా రెండు స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు మిడ్ రేంజ్ కేటగిరితో వచ్చాయి. యూజర్లను ఆకట్టుకునేలా ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు Realme 10 Pro Plus భారత మార్కెట్లో ఫస్ట్ సేల్ ప్రారంభమైంది.

ఈ స్మార్ట్‌ఫోన్ గతంలో చైనాలో లాంచ్ అయింది. Realme 10 Pro Plus సిరీస్ ఫోన్.. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. రియల్‌మి 10 ప్రో ప్లస్ USP, కర్వ్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో కర్వ్డ్ డిస్‌ప్లేతో వచ్చిన కంపెనీ ఫోన్ ఇదే.. సిమెట్రిక్ బెజెల్స్‌తో వచ్చింది. రియల్‌మి 10ప్రో సిరీస్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే కొనే ముందు ఫోన్ ధర, స్పెసిఫికేషన్‌లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Realme 10 Pro Plus first sale in India today _ Price, Specifications and more

Realme 10 Pro Plus first sale in India today _ Price, Specifications and more

రియల్‌మి ధర ఎంతంటే? :
రియల్‌మి 10 Pro Plus ఫోన్ (6GB + 8GB) వేరియంట్‌లతో సహా రెండు వేర్వేరు వేరియంట్‌లలో లాంచ్ కానుంది. 6GB+128GB వేరియంట్ ధర రూ.24,999గా ఉండనుంది. బ్యాంక్ ఆఫర్‌లతో ఈ డివైజ్ ధర రూ.23,999కి కొనుగోలు చేయవచ్చు. Realme 10 Pro Plus (8GB+128GB) వేరియంట్‌ను రూ. 25,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్ హైపర్‌స్పేస్ గోల్డ్, డార్క్ మేటర్, నెబ్యులా బ్లూతో సహా మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

Realme 10 Pro Plus : స్పెసిఫికేషన్‌లు ఇవే :
Realme 10 Pro Plus Full HD+ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల AMOLED కర్వ్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 360 Hz టచ్ శాంప్లింగ్ రేట్‌కు కూడా సపోర్టు అందిస్తుంది. Realme 10 Pro Plus ఫోన్ డివైజ్‌లోMediaTek Dimensity 1080 SoCతో పాటు 12GB RAM, 256GB స్టోరేజ్‌తో వస్తుంది.

Realme 10 Pro Plus first sale in India today _ Price, Specifications and more

Realme 10 Pro Plus first sale in India today _ Price, Specifications and more

ఆప్టిక్స్ పరంగా.. Realm 10 Pro Plus వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 108-MP ప్రైమరీ కెమెరా, 8-MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2-MP మాక్రో షూటర్ ఉన్నాయి. సెల్ఫీల కోసం.. ఫోన్ 16-MP ఫ్రంట్ కెమెరాతో కూడా వస్తుంది. ఇతర ముఖ్య ఫీచర్లలో ఆండ్రాయిడ్ 13 ఆధారిత Realme UI 4, 33W ఫాస్ట్ ఛార్జింగ్, 5G, 67W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 5000mAh బ్యాటరీ ఉన్నాయి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : iPhone 5G Services : ఆపిల్ ఐఫోన్లలో ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో 5G సర్వీసులు.. ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసా?