Prabhas: రెబల్‌ స్టార్ పాన్‌ వరల్డ్ సినిమా.. కొరియన్ భామతో రొమాన్స్!

రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయి దాటేశాడు. ఈసారి పాన్ వరల్డ్ స్థాయిని టార్గెట్ చేశాడు. ప్రస్తుతం వరసగా అరడజను సినిమాల లైనప్ సెట్ చేసిన ప్రభాస్ ప్రస్తుతానికి..

Prabhas: రెబల్‌ స్టార్ పాన్‌ వరల్డ్ సినిమా.. కొరియన్ భామతో రొమాన్స్!

Prabhas

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయి దాటేశాడు. ఈసారి పాన్ వరల్డ్ స్థాయిని టార్గెట్ చేశాడు. ప్రస్తుతం వరసగా అరడజను సినిమాల లైనప్ సెట్ చేసిన ప్రభాస్ ప్రస్తుతానికి రాధేశ్యామ్ మూవీ రిలీజ్ కు సిద్ధం చేయగా.. ఆల్రెడీ నెక్ట్స్ సమ్మర్ రిలీజ్ కు ఎయిమ్ చేసుకుని ఓమ్ రౌత్ తో చేస్తున్న ఆదిపురుష్ సినిమాని ఓ కొలిక్కి తీసుకోస్తున్నాడు. ఇక, సలార్ ని స్పీడప్ చెయ్యడానికి ఇప్పటికే ప్లాన్ చేసుకోగా ఇది పూర్తికాకుండానే నాగశ్విన్ తో ప్రాజెక్ట్ కె ని ప్లాన్ చేశారు.

Sreeja-Kalyan Dev: విడాకుల రూమర్స్‌కు కళ్యాణ్ దేవ్ స్వీట్ ఆన్సర్!

ఇక, ఇప్పటికే 24వ సినిమాను సిద్దార్థ్ ఆనంద్‌తో చేయనున్నట్టు తెలుస్తుండగా ఆ సినిమా మొదలు కాకముందే సందీప్ రెడ్డి వంగాతో తన 25వ సినిమా స్పిరిట్ అనౌన్స్ చేశాడు. ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలే కాగా మార్కెట్ కూడా వెయ్యికి కోట్లకు పైమాటే. వీటిలో, ఆదిపురుష్, నాగశ్విన్ కె సినిమాలు ఇండియాలోని అన్ని బాషలతో పాటు చైనీస్, జాపనీస్ బాషలలో కూడా విడుదల చేసేందుకు సిద్ధమవుతుండగా.. సందీప్ వంగా సినిమా ఇప్పటికే ఎనిమిది బాషలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కుదిరితే ఇంగ్లీష్ లో కూడా విడుదల చేయనున్నారు.

Godfather: క్రేజీ న్యూస్.. మెగాస్టార్ కోసం సల్లు భాయ్?

కాగా, ఈ సినిమా గురించి ఇప్పుడు మరో ఆసక్తికర వార్త ఒకటి వైరల్ అవుతుంది. పాన్‌ వరల్డ్‌ స్థాయిని టార్గెట్ చేసినా ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా సౌత్‌ కొరియన్‌ బ్యూటీ నటించనుందని టాక్‌ వినిపిస్తోంది. కొరియన్‌ టీవీ డ్రామాలతో ఫేమ్ సంపాదించుకున్న సాంగ్ హై క్యో(Song Hye-Kyo)ను ఈ మూవీలో హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కరీనా కపూర్ లేడీ విలన్ గా నటిస్తున్నట్లు కథనాలొస్తుండగా ఇప్పుడు కొరియన్ బ్యూటీ హీరోయిన్ అంటున్నారు. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.