Redmi Note 12 Pro Plus Price : ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 30వేల లోపు ధరకే రెడ్‌మి నోట్ 12ప్రో ప్లస్ సొంతం చేసుకోవచ్చు.. మరెన్నో డిస్కౌంట్ ఆఫర్లు.. డోంట్ మిస్!

Redmi Note 12 Pro Plus Price : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మి నోట్ 12 ప్రో+ భారత మార్కెట్లో ఫస్ట్ సేల్ మొదలైంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ డివైజ్ కొనుగోలు చేసేందుకు Flipkart లేదా mi.comకి విజిట్ చేయవచ్చు.

Redmi Note 12 Pro Plus Price : ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 30వేల లోపు ధరకే రెడ్‌మి నోట్ 12ప్రో ప్లస్ సొంతం చేసుకోవచ్చు.. మరెన్నో డిస్కౌంట్ ఆఫర్లు.. డోంట్ మిస్!

Redmi Note 12 Pro Plus price in India starts at Rs 29,999 but you can get it for much lower price

Redmi Note 12 Pro Plus Price : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మి నోట్ 12 ప్రో+ భారత మార్కెట్లో ఫస్ట్ సేల్ మొదలైంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ డివైజ్ కొనుగోలు చేసేందుకు Flipkart లేదా mi.comకి విజిట్ చేయవచ్చు. మొదటి సేల్‌లో భాగంగా Redmi నుంచి మూడు Redmi Note 12 సిరీస్ ఫోన్‌లపై డిస్కౌంట్ ఆఫర్‌లను అందిస్తోంది. టాప్-ఎండ్ మోడల్, aka Redmi Note 12 Pro+ అధికారికంగా రూ. 29,999 ప్రారంభ ధరకు సొంతం చేసుకోవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ మొదటి సేల్ సమయంలో ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే.. మీరు అంతకన్నా చాలా తక్కువ ధరకు పొందవచ్చు. Redmi Note 12 Pro+ ఫోన్ (8GB+256GB, 12GB+256GB) రెండు వేరియంట్లలో వస్తుంది. రెడ్‌మివిషయానికొస్తే.. Redmi Note 12 Pro+ 8GB RAM మోడల్‌కు రూ. 29,999 ధరతో ప్రారంభమవుతుంది. టాప్-ఎండ్ 12GB RAM మోడల్‌ ధర రూ. 32,999కి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Mi.com, Flipkart.com, Mi Home, Mi Studio, Mi పార్టనర్ ప్లాట్ ఫారంలో అందుబాటులో ఉంది.

రెడ్‌మి Note 12 Pro+ డిస్కౌంట్ ఆఫర్లు :
కొత్త ఆఫర్‌లో భాగంగా Redmi ICICI బ్యాంక్‌తో భాగస్వామ్యంతో రూ. 3000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందించింది. ఈ డిస్కౌంట్ కోసం అప్లయ్ చేసిన తర్వాత Redmi Note 12 Pro+ ఫోన్ 8GB RAM మోడల్‌ను రూ. 26,999కి కొనుగోలు చేయవచ్చు. అయితే 12GB RAM మోడల్ రూ. 29,999కి అందుబాటులో ఉంటుంది.

Redmi Note 12 Pro Plus price in India starts at Rs 29,999 but you can get it for much lower price

Redmi Note 12 Pro Plus price in India starts at Rs 29,999 but you can get it

Read Also : Redmi Note 12 5G India : ఇండియాకు రెడ్‌మి నోట్ 12 5G సిరీస్ వచ్చేస్తోంది.. ఫీచర్లు అదుర్స్.. లాంచ్ ఎప్పుడు? ధర ఎంత ఉండొచ్చుంటే?

ఈ ధరల కోసం Redmi Note 12 Pro+ పరిగణలోకి తీసుకునేందుకు బెస్ట్ ఆప్షన్ కనిపిస్తోంది. అదనంగా, కంపెనీ ఇప్పటికే ఉన్న Xiaomi/ Mi, Redmi స్మార్ట్‌ఫోన్ యూజర్లకు రూ. 1000 డిస్కౌంట్ కూడా అందిస్తోంది. Redmi Note 12 Pro+ ప్రారంభ ధరను రూ. 25,999కి సొంతం చేసుకోవచ్చు. మీరు కొత్త రెడ్‌మి నోట్ ఫోన్‌ని పొందడానికి మీ పాత ఫోన్‌ను అమ్మాలనుకుంటే.. ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌పై అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తోంది.

స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. Redmi Note 12 Pro+ డాల్బీ విజన్ సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 సపోర్ట్‌తో 6.67-అంగుళాల Pro AMOLED డిస్‌ప్లేతో రానుంది. MediaTek డైమెన్సిటీ 1080తో పాటు 12GB RAM, 256GB స్టోరేజ్‌తో రానుంది. ఈ ఫోన్ వెనుక ప్యానెల్‌లో 8-MP + 2-MP కెమెరాతో పాటు 200-MP ప్రైమరీ కెమెరాను అందిస్తుంది.

ఈ ఫోన్ ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్‌ 16-MP కెమెరాను కలిగి ఉంది. Redmi Note 12 Pro+ 4980mAh బ్యాటరీ యూనిట్‌తో పాటు 120W హైపర్‌ఛార్జ్ సపోర్ట్‌ అందిస్తుంది. రెడ్‌మి ఫోన్ బాక్స్‌లో 120W వైర్డు ఛార్జర్‌తో వచ్చింది. కేవలం 19 నిమిషాల వ్యవధిలో ఫోన్ పూర్తిగా ఛార్జింగ్ అవుతుందని కంపెనీ పేర్కొంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Redmi Note 12 5G Series Sale : రెడ్‌మి నోట్ 12 5G సిరీస్ ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. మూడు కొత్త ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఏ మోడల్ ధర ఎంతో తెలుసా?