RGV : పబ్‌లో ఆర్జీవీ రచ్చ.. నటితో ఫోటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్..

తాజాగా పబ్‌లో అమ్మాయిలతో మద్యం తాగుతూ చిందులేశాడు ఆర్జీవీ. దీనికి సంబంధించిన వీడియోలను, ఫోటోలను సైతం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకున్నాడు. సిగరెట్‌ తాగుతూ, మందు తాగుతూ పబ్‌లో...

RGV : పబ్‌లో ఆర్జీవీ రచ్చ.. నటితో ఫోటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్..

Rgv

RGV :  డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ ఏం చేసినా సెన్సేషనే. ఇక ఆయన ఎంజాయిమెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎవరేమన్నా పట్టించుకోకుండా తనకు నచ్చినట్టు నచ్చిన వారితో ఎంజాయ్ చేస్తాడు. ఎంజాయ్ చేసి అక్కడితో ఆపకుండా ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ అవుతాడు, వార్తల్లో నిలుస్తాడు ఆర్జీవీ. పబ్బుల్లో తాగుతూ, డ్యాన్సులు వేస్తూ చాలా సార్లు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తాజాగా మరోసారి ఇలాంటి ఫొటోలతోనే ఆర్జీవీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు.

BiggBoss Kaushal : షేక్ హ్యాండ్ ఇవ్వ‌డం మానేయ‌కే కరోనా తెచ్చుకున్నాను

తాజాగా పబ్‌లో అమ్మాయిలతో మద్యం తాగుతూ చిందులేశాడు ఆర్జీవీ. దీనికి సంబంధించిన వీడియోలను, ఫోటోలను సైతం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకున్నాడు. సిగరెట్‌ తాగుతూ, మందు తాగుతూ పబ్‌లో నటి ఇనయా సుల్తానాకు ముద్దుపెట్టాడు. ఇనయా సుల్తానాతో సిగరెట్ తాగుతున్న ఫోటోలు, మందు తాగే ఫోటోలు కూడా షేర్ చేశాడు. ఇనయా కూడా వాటిని తన సోషల్ మీడియాలో షేర్ చేయడం విశేషం. గతంలో కూడా ఈమె బర్త్‌డే వేడుకల్లో ఆర్జీవీ పాల్గొని ఆమెతో డ్యాన్స్‌ చేస్తూ రచ్చ చేసిన సంగతి తెలిసిందే.