RGV : అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. కొత్త మెగాస్టార్ అంటూ..

ఆర్జీవీ కూడా తనదైన స్టైల్ లో 'పుష్ప' సినిమాపై అల్లుఅర్జున్ ని పొగుడుతూ గతంలోనే ట్వీట్ చేశాడు. తాజాగా మరోసారి అల్లు అర్జున్ ని ఉద్దేశించి ఇండైరెక్ట్ గా ట్వీట్ చేశాడు.......

RGV : అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. కొత్త మెగాస్టార్ అంటూ..

Rgv Alluarjun

Allu Arjun :  టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. సినీ పరిశ్రమలో అయినా, బయటి విషయాలు అయినా ఎలాంటి వాటిపైన అయినా ట్వీట్స్ చేస్తూ ఉంటారు. ఆయన ట్వీట్ చేస్తే ప్రతి వార్త వైరల్ అవ్వాల్సిందే. ఇటీవల సోషల్ మీడియాలో మరింత యాక్టీవ్ గా ఉన్నారు ఆర్జీవీ. రోజూ ఏదో ఒక విషయంపై ట్వీట్స్ వేస్తూనే ఉన్నారు.

 

ఇటీవల అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో తన నట విశ్వరూపం చూపించారు. అన్ని సినీ పరిశ్రమల నుంచి దేశం నలుమూలల నుంచి బన్నీని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చాలా మంది సెలబ్రిటీలు కూడా బన్నీని పొగుడుతూ ట్వీట్స్ చేశారు. ఆర్జీవీ కూడా తనదైన స్టైల్ లో ‘పుష్ప’ సినిమాపై అల్లుఅర్జున్ ని పొగుడుతూ గతంలోనే ట్వీట్ చేశాడు. తాజాగా మరోసారి అల్లు అర్జున్ ని ఉద్దేశించి ఇండైరెక్ట్ గా ట్వీట్ చేశాడు.

Sreeja : భర్త పేరు తీసేసిన చిరంజీవి కూతురు.. సమంతని ఫాలో అవుతుందా??

“కఠినమైన కానీ కాదనలేని వాస్తవం అల్లు కొత్త మెగా” అని ట్వీట్ చేశాడు ఆర్జీవీ. దీనికి అర్ధం కొంతమందికి ఇది కఠినంగా అనిపించినా అల్లు అర్జున్ కొత్త మెగాస్టార్ అంటూ తనదైన స్టైల్ లో ట్వీట్ చేశాడు. గత కొంతకాలంగా అల్లు అర్జున్ కూడా తనని తాను బాగా ప్రమోట్ చేసుకుంటున్నాడు. అన్ని ఈవెంట్స్ కి గెస్ట్ గా వెళ్తున్నాడు. వీటితో పాటు మెగా ఫ్యామిలీకి కొంచెం దూరంగా ఉంటున్నాడు. మెగా ఫ్యామిలీ హీరో అనే ట్యాగ్ నుంచి బయటపడి సొంతంగా పేరు తెచ్చుకోవాలని ఎప్పట్నుంచో బన్నీ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప సినిమాతో ఇది మరింతగా ప్రచారం జరిగింది. దీంతో ఆర్జీవీ ఈ ట్వీట్ చేయడంతో ఓ పక్కన బన్నీ అభిమానులు సపోర్ట్ గా ట్వీట్ ని వైరల్ చేస్తుంటే మెగా అభిమానులు మాత్రం నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.