RGV : ‘భీమ్లా నాయక్’ విడుదలపై ఆర్జీవీ ట్వీట్.. ‘పుష్ప’ని బీట్ చేస్తాడా అంటూ.. ఫ్యాన్స్ మధ్య చిచ్చు

భీమ్లా నాయక్ హిందీ రిలీజ్ పై ఆర్జీవీ.. ''భీమ్లా నాయక్ ని హిందీలో విడుదల చేస్తున్నందుకు గ్రేట్. ఇప్పుడు పవన్ కల్యాణ్ తన చిత్రం పుష్ప కంటే పెద్దదని, అతను అల్లు అర్జున్ కంటే..........

RGV : ‘భీమ్లా నాయక్’ విడుదలపై ఆర్జీవీ ట్వీట్.. ‘పుష్ప’ని బీట్ చేస్తాడా అంటూ.. ఫ్యాన్స్ మధ్య చిచ్చు

Rgv

 

Bheemla Nayak :  పవన్ కళ్యాణ్, రానాలు హీరోలుగా మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ‘భీమ్లా నాయక్’ సినిమా వాయిదా పడుతూ వస్తూ మొత్తానికి రిలీజ్ కి సిద్ధమైంది. ఫిబ్రవరి 25న ‘భీమ్లా నాయక్’ సినిమాని విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమాని కేవలం తెలుగులోనే అనుకున్నా ఇప్పుడు హిందీలో కూడా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఉన్న అందరు హీరోలు బాలీవుడ్ లో కూడా తమ సినిమాలు రిలీజ్ చేసి పాన్ ఇండియా హీరోలుగా మారుతున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ కూడా ఇదే పంథాలో వెళ్తున్నారు.

అయితే దీనిపై గతంలోనే ఆర్జీవీ ట్వీట్ చేసాడు. మీ తర్వాత వచ్చిన చిన్న హీరోలంతా పాన్ ఇండియా స్టార్లు అయిపోతున్నారు, మీరు ఎప్పుడు అవుతారు? భీమ్లా నాయక్ సినిమాని హిందీలో రిలీజ్ చేయండి అంటూ పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేస్తూ ఆర్జీవీ ట్వీట్ చేశాడు. అయితే భీమ్లా నాయక్ సినిమా హిందీలో రిలీజ్ చేస్తున్నారు అని ప్రకటించిన తర్వాత మరో ట్వీట్ చేశాడు ఆర్జీవీ.

Bheemla Nayak: భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫిబ్రవరి 25నే వచ్చేస్తోంది

భీమ్లా నాయక్ హిందీ రిలీజ్ పై ఆర్జీవీ.. ”భీమ్లా నాయక్ ని హిందీలో విడుదల చేస్తున్నందుకు గ్రేట్. ఇప్పుడు పవన్ కల్యాణ్ తన చిత్రం పుష్ప కంటే పెద్దదని, అతను అల్లు అర్జున్ కంటే పెద్ద హీరో అని, పాన్ ఇండియా లెవల్లో నిరూపించగలడు” అంటూ ట్వీట్ చేశాడు. అయితే దీంతో పాటు అల్లు అర్జున్ పుష్ప సినిమా బాలీవుడ్ లో సాధించిన సక్సెస్ ని పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ బీట్ చేయగలదా అంటూ ట్వీట్ పెట్టి పోల్ కూడా పెట్టాడు.

ఈ పోల్ తో పవన్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టాడు. దీనిపై సోషల్ మీడియాలో అటు పవన్ ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. అసలే కొన్ని రోజుల నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి, పవన్ ఫ్యాన్స్ కి పడట్లేదు. ఈ ట్వీట్ తో మరోసారి వీరిద్దరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు పోస్టులు చేసుకుంటున్నారు.