Rithu Chowdary : బుల్లితెర స్టార్ ప్రేమలో పడింది.. సోషల్ మీడియాలో బాయ్ ఫ్రెండ్‌తో రచ్చ..

పలు సీరియల్స్, టీవీ షోలు, సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో యాక్టీవ్ గా ఉన్న రీతూ ఇటీవల ప్రేమలో పడింది. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ట్రిప్పులు వేస్తూ అతనితో ఫొటోలు దిగి................

Rithu Chowdary : బుల్లితెర స్టార్ ప్రేమలో పడింది.. సోషల్ మీడియాలో బాయ్ ఫ్రెండ్‌తో రచ్చ..

Rithu

Rithu Chowdary :  గోరింటాకు, అమ్మకోసం, ఇంటిగుట్టు.. లాంటి పలు సీరియల్స్ తో మెప్పించిన రీతూ చౌదరి ఆ తర్వాత జబర్దస్త్ లో నటించి బాగా ఫేమ్ తెచ్చుకుంది. పలు టీవీ షోలలో కూడా కనిపిస్తూ పాపులర్ అయింది. ఇక సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో రచ్చ చేస్తుంది రీతూ చౌదరి. ప్రస్తుతం పలు సీరియల్స్, టీవీ షోలు, సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో యాక్టీవ్ గా ఉన్న రీతూ ఇటీవల ప్రేమలో పడింది. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ట్రిప్పులు వేస్తూ అతనితో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.

Sreenu Vaitla : ఒకప్పటి స్టార్ డైరెక్టర్ విడాకులు తీసుకుంటున్నాడా??

ఇటీవల అతనితో సన్నిహితంగా ఉన్న ఫోటో పోస్ట్ చేసిన రీతూ..”మా బంధం కంటే గొప్పగా ఇంకేదీ ఉండదు” అని క్యాప్షన్‌ ఇచ్చింది. దీంతో మరోసారి నెటిజన్లు, ప్రేక్షకులు కన్ఫర్మ్ చేసుకున్నారు. అతని పేరు శ్రీకాంత్ అని, బిజినెస్‌మెన్ అని తెలుస్తుంది. ఇటీవలే కొత్త కారు కొన్న రీతూ బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఆ కార్‌లో ట్రిప్పులు వేస్తూ ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తుంది. మరి పెళ్లి సంగతేంటో మాత్రం చెప్పలేదు ఈ భామ. ప్రేమలో ఉన్నాను అని ఇండైరెక్ట్ గా చెప్పడంతో పలువురు నెటిజన్లు, ప్రముఖులు కంగ్రాట్స్ చెప్తున్నారు రీతూకి. ఇక ఆ శ్రీకాంత్ అనే వ్యక్తి కూడా తన ఇన్‌స్టాగ్రామ్ డీపీకి రీతూతో ఉన్న ఫొటో పెట్టుకోవడంతో కచ్చితంగా పెళ్లి చేసుకుంటారు అని బుల్లితెర వర్గాల్లో వినిపిస్తుంది.

 

Rithu