IPL 2022: ఐపీఎల్‌లో రోహిత్ శర్మ రికార్డులు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న ప్లేయర్ రోహిత్ శర్మ. ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్సీ వహించి 2013 నుంచి 2021 ఎడిషన్స్ మధ్యలో ఐదు సార్లు

IPL 2022: ఐపీఎల్‌లో రోహిత్ శర్మ రికార్డులు

Rohit Sharma

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న ప్లేయర్ రోహిత్ శర్మ. ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్సీ వహించి 2013 నుంచి 2021 ఎడిషన్స్ మధ్యలో ఐదు సార్లు ట్రోఫీ తెచ్చిపెట్టాడు. మరి కొద్ది రోజుల్లో మొదలుకానున్న సీజన్ కు తొమ్మిదో సంవత్సరం కెప్టెన్ గా అడుగుపెడుతున్నాడు.

చివరిగా ముగిసిన ఐపీఎల్ 2021 ముంబై ఇండియన్స్ అభిమానులను నిరాశపరిచింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ప్లేఆఫ్స్‌కు కూడా చేరుకోలేకపోవడం గమనార్హం. కాకపోతే కెప్టెన్ గా రోహిత్ ఐపీఎల్ లో బోలెడు రికార్డులు సొంతం చేసుకున్నాడు.

రోహిత్ శర్మ ఐపీఎల్ కెప్టెన్సీ రికార్డ్
ఐపీఎల్ 2013 సీజన్ నుంచి రోహిత్ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి 129 మ్యాచ్ లకు కెప్టెన్సీ వహించాడు. 75మ్యాచ్ లు గెలిచి 50 ఓటమికి గురికాగా, 4 మ్యాచ్ లు టైగా ముగిశాయి.

రోహిత్ శర్మ వర్సెస్ ధోనీ
2013 నుంచి 5గెలిచి 50ఓడి 4 టైగా ముగియగా.. ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ 204మ్యాచ్ లు ఆడింది. 121 గెలిచి 82ఓడిపోగా ఒక్కదానిలో మాత్రమే ఫలితం తేలలేదు.

Read Also : రోహిత్ కొట్టిన షాట్‌‌కు ప్రేక్షకుడి ముక్కు పగిలింది..

రోహిత్ శర్మ వర్సెస్ విరాట్ కోహ్లీ..
విరాట్ కెప్టెన్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడింది 140మ్యాచ్ లు అయితే గెలిచింది 64, ఓడింది 69. మూడు టై, 4మ్యాచ్ లకు ఫలితం తేలలేదు.

రోహిత్ వర్సెస్ గౌతం గంభీర్
కోల్‌కతా ఫ్రాంచైజీకి కెప్టెన్సీ వహించిన గంభీర్.. 129 మ్యాచ్ లలో 71 గెలిచి 57 మ్యాచ్ లలో ఓటమికి గురై ఒక్కటి మాత్రమే టైగా ముగించాడు.