Roja : అందరూ యూట్యూబ్‌లో హోమ్‌టూర్.. రోజా మాత్రం ఏకంగా టీవీలోనే హోమ్‌టూర్

 ఒకపక్క ఎమ్మెల్యేగా బిజీగా ఉంటూనే మరో పక్క జబర్దస్త్ టీవీ షోతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తుంది నటి, ఎమ్యెల్యే రోజా. ఇటీవల చాలా మంది సెలబ్రిటీలు తమ తమ యూట్యూబ్ ఛానల్స్ లో..........

Roja :  అందరూ యూట్యూబ్‌లో హోమ్‌టూర్.. రోజా మాత్రం ఏకంగా టీవీలోనే హోమ్‌టూర్

Roja

Roja :  ఒకపక్క ఎమ్మెల్యేగా బిజీగా ఉంటూనే మరో పక్క జబర్దస్త్ టీవీ షోతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తుంది నటి, ఎమ్యెల్యే రోజా. ఇటీవల చాలా మంది సెలబ్రిటీలు తమ తమ యూట్యూబ్ ఛానల్స్ లో వాళ్ళ ఇళ్ళని చూపిస్తూ హోమ్ టూర్ చేస్తున్నారు. అయితే రోజా మాత్రం ఏకంగా టీవీలోనే హోమ్ టూర్ చేసింది. తాజాగా రిలీజ్ అయిన జబర్దస్త్ ప్రోమోలో రోజా తన ఇంటిని చూపిస్తూ హోమ్ టూర్ చేసినట్లు చూపించారు.

ముందుగా హైపర్‌ ఆది, మరి కొంతమంది జబర్దస్త్ ఆర్టిస్టులు నగరిలోని రోజా ఇంటికి వెళ్లారు. వాళ్ళని రోజా రిసీవ్ చేసుకొని ఇల్లంతా చూపించింది. ముందుగా డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా ఉన్న పెద్ద వెంకటేశ్వర స్వామి ఫోటోని చూపించింది. ఆ తర్వాత కిచెన్ చూపించింది. ఆ తర్వాత పూజాగది, బెడ్‌ రూమ్‌, హాల్‌, పిల్లల రూమ్స్. ఇతర రూమ్‌లను, ఇంటి పైన, టోటల్‌గా మొత్తం ఇంటిని తిప్పి చూపించింది రోజా. మధ్యలో రోజా భర్త సెల్వమణి కూడా వచ్చారు.

James : పునీత్ చివరి సినిమా టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. వెయిట్ చేస్తున్న అభిమానులు

నగరిలో రోజా ఇంటిని ఇలా చూపించడం ఇదే మొదటి సారి. అది కూడా ఏకంగా టీవీలో ‘జబర్దస్త్’ షోలో రోజా హోమ్ టూర్ చేయడం విశేషం. ఈ గురువారం వచ్చే ‘జబర్దస్త్’ షోలో రోజా హోమ్‌ టూర్‌కి సంబంధించి పూర్తి వీడియోని చూపించనున్నారు.